Adani Group: టెల్కో ప్రత్యర్థులకు షాక్, టెలికం రంగంలోకి అదాని గ్రూపు, 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 100 కోట్లు డిపాజిట్‌
Adani Group Chairman Gautam Adani. (Photo Credits: IANS)

5జీ స్పెక్ట్రం వేలంలోకి ప్రవేశించడం ద్వారా అదాని గ్రూపు టెలికం రంగంలోకి ప్రవేశించింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో (5G blitz) అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ. 100 కోట్లు డిపాజిట్‌ చేసింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ అదానీ టెలికా రంగంలో (Adani Group confirms entry into telecom spectrum race) ప్రవేశాస్తున్నారన్న ఊహాగానాలు ప్రత్యర్థి టెల్కోలను ఆందోళనకు గురి చేశాయి, ఆరేళ్ల క్రితం ముకేశ్ అంబానీ జియో ఎంట్రీ, సృష్టించిన సునామీని గుర్తు చేసుకుంటున్నారు.

అయితే అదానీ ( Adani Group) పోటీకి దూరంగా ఉన్నారనీ, 3.5 GHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేస్తారని భావించడం లేదని పేరు చెప్పడానికి అంగీకరించని టాప్ ఎగ్జిక్యూటివ్ అన్నారు.ఆదాని గ్రూపు 650-700 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయనుంది, కానీ ప్రస్తుతానికి, వినియోగదారుల సేవల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. బిలియనీర్ అదానీకి భిన్నంగా, అంబానీకి చెందిన రిలయన్స్ జియో (Reliance Jio) ఇన్ఫోకామ్ లిమిటెడ్ ₹14,000 కోట్లను డిపాజిట్‌ చేయడం ఆసక్తికర అంశం.

ఆదానికి షాకిస్తూ జియో మరో సంచలనం, 5జీ స్పెక్ట్రం వేలం కోసం ఏకంగా రూ. 14 వేల కోట్ల డిపాజిట్, భారతి ఎయిర్‌టెల్‌ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 2,200 కోట్లు డిపాజిట్

14,000 కోట్లతో, వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రమ్‌లో మూడింట ఒక వంతు, 1.4 ట్రిలియన్ విలువైన స్పెక్ట్రమ్‌ను జియో కొనుగోలు చేయవచ్చు. జియో డిపాజిట్ భారీ స్పెక్ట్రమ్ కొనుగోలు ప్రణాళికను సూచిస్తుందనీ, దీనికితోడు ఇప్పటికే 4G ఫ్రీక్వెన్సీల కోసం మునుపటి వేలంలో 57వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది, ఇక 4జీ లేదా ఇతర బ్యాండ్స్‌ ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.