Newdelhi, Jan 18: స్మార్ట్ ఫోన్ (Smart Phone) వినియోగదారులకు ఇటీవల మోసపూరిత కాల్స్, అనుమానిత (స్పామ్) కాల్స్ (Spam Calls) బెడద ఎక్కువైంది. అనేక మంది అనుమానిత కాల్స్, సందేశాలతో మోసపోతున్నారు. వారికి తెలియకుండానే వారి బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయం అవుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టెలికం శాఖ ఈ మోసపూరిత కాల్స్, సందేశాలకు చెక్ పెట్టేందుకు కొత్తగా ‘సంచార్ సాథీ మొబైల్ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లు వచ్చిన సమయంలో కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా వారి పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అలా సైబర్ వలయంలో చిక్కుకోకుండా తమను తాము కాపాడుకోవచ్చు.
SANCHAR SAATHI APP is now LIVE!
Scan for your digital safety today and access essential tools at your fingertips!#SancharSaathiMobileApp pic.twitter.com/TNKhRHUE4O
— DoT India (@DoT_India) January 17, 2025
బ్లాక్ సదుపాయం కూడా..
ఫిర్యాదులే కాదు మొబైల్ అపహరణకు గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం కూడా ఈ యాప్ లో ఉంది. మొబైల్ ఫోన్ ప్రామాణికతను కూడా యాప్ సాయంతో గుర్తించవచ్చు. ఇందుకోసం ఐఎంఈఐ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (వీడియో)