Budget 2020: ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీగా నిధులు, SC, OBCలకు కలిపి రూ.85 వేల కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 53 వేల 700 కోట్లు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రూ.9 వేల 500 కోట్లు
ఈ సందర్భంగా పలు రంగాలకు కేటాయింపులు జరిపారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ 2020-21లో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
New Delhi,Febuary 01: కేంద్ర బడ్జెట్ 2020 - 2021 (Union Budget 2020) సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు రంగాలకు కేటాయింపులు జరిపారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ 2020-21లో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
SC, OBCలకు కలిపి రూ.85 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే..ఎస్టీల సంక్షేమానికి రూ. 53 వేల 700 కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రూ. 9 వేల 500 కోట్లు కేటాయింపులు చేశారు.
నరేంద్ర మోదీ (PM Modi) రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. ప్రసంగం మొదటిలో ఆమె ఇది సామాన్యుల బడ్జెట్ అని చెప్పారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో బడ్జెట్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు.
ఆదాయల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్ తీసుకొచ్చామన్నారు. యువతను శక్తివంతం చేసేలా ప్రభుత్వం ప్రాధామ్యాలు ఉంటాయన్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని చెప్పారు. అంతేగాకుండా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడగు వేస్తున్నామన్నారు.