New Delhi, Febuary 01: దేశంలో సాంకేతిక రంగంలో ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా టెక్నాలజీ (Technology) రంగంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) ఫోకస్ పెట్టింది. 2020 కేంద్ర బడ్జెట్ లో(Union Budget 2020) టెక్నాలజీ రంగానికి చేయూతనిచ్చేలా లక్ష గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టవిటీని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా భారత నెట్ కు 2020-21 బడ్జెట్ లో (Budget 2020) రూ.6వేల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.
బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారత్ లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందిస్తామని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సంందర్భంగా ఇంటర్నెట్ గురించి మాట్లాడుతూ..ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశంలోని లక్ష గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్ నెట్ కనెక్షన్ అనుసంధానిస్తామని త్వరలోనే ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్థికరంగ స్వరూపాన్నే మార్చేస్తున్నాయన్నారు. కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. పోటీని తట్టుకుని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు డేటా సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్మల స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా డేటా సెంటర్ల (data centre parks) ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కుల నిర్మాణానికి ఒక విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
డేటా సెంటర్ పార్కులతో పాటు లక్ష గ్రామ పంచాయతీలను డిజిటల్ విలేజ్ (Digital Village) గా మారుస్తామని, సెల్ ఫోన్లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారులకు ప్రత్యేక పథకం ప్రవేశపెడతామన్నారు. 9వేల కిలోమీటర్ల వరకు ఎకనామికల్ కారిడర్, ఎనలిటిక్స్, ఐఓటీ, ఏఐ సాంకేతిక అభివృద్ధితో ప్రపంచాన్నే మార్చేస్తుందన్నారు.లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ పైబర్ ద్వారా హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టవిటీని అందిస్తామని ఆమె తెలిపారు. ఫైబర్ టూ హోం ద్వారా భారత్ నెట్ సౌకర్యంతో లక్ష గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంవత్సరం 2020-21 నాటికి డిజిటల్ కనెక్టవిటీని కల్పిస్తామన్నారు.