Economic Survey 2023-24: ఆర్థిక సర్వే హైలెట్స్ ఇవిగో, వ్యవసాయంపై మరింత దృష్టి సారించాలని తెలిపిన కేంద్ర మంత్రి, ఎఫ్‌వై24లో 5.4 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండో పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి.ఈ సమావేశాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వే 2023-24ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

Finance Minister Nirmala Sitharaman (Photo-ANI)

New Delhi, July 22: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండో పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి.ఈ సమావేశాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వే 2023-24ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు.బడ్జెట్‌లో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయిండ్‌ బిజినెస్‌’పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.కాగా రేపు జరగబోయే పార్లమెంట్‌ సమావేశంలో కేంద్రమంత్రి బడ్జెట్‌ 2024-25ను ప్రకటిస్తారు.

ఆర్థిక సర్వే సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘ఆర్థిక సర్వేలో 2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని, ఇది మూలధన ప్రవాహాలపై ప్రభావం చూపుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. సేవారంగంలో మున్ముందు మంచి వృద్ధి ఉండవచ్చు. ఉద్యోగావకాశాల కల్పనలో కార్పొరేట్ రంగం పాత్ర పెరగాలి.  లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌, నీట్ అవకతవకలపై మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ఇండియా కూటమి, బడ్జెట్‌ సమావేశాలు హైలెట్స్ ఇవిగో..

పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 2023 మొదటి మూడు నెలల్లో 6.7 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో పెద్దగా నియామకాలు జరగడం లేదు. పెరుగుతున్న శ్రామికశక్తి అవసరాలను తీర్చడానికి భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలిని మంత్రి తెలిపారు. భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగాయి.

2023-24లో మూలధన వ్యయ లోటు(సీఏడీ) జీడీపీలో 0.7 శాతంగా ఉంది. ఇది 2022-23 జీడీపీలో 2.0 శాతంగా ఉంది.ప్రభుత్వ మూలధన వ్యయం పెరిగింది. దాంతో ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకున్నాయి. 2023-24లో స్థూల స్థిర మూలధన వ్యయం 9 శాతం పెరిగింది.మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల నిర్మాణ రంగం ప్రాముఖ్యతను సంతరించుకుంది.  వీడియో ఇదిగో, సైకిల్ మీద పార్లమెంటుకు వచ్చిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని వెల్లడి

దేశంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత పెరుగుతుందని సర్వే తెలిపింది. ఈ ఏడాది NHAI కోసం 33 ఆస్తులు విక్రయించడానికి గుర్తించబడ్డాయి. ప్రయివేటు రంగం లాభం పెరిగిందని, కానీ ఉపాధి అవకాశాలు అందుకు అనుగుణంగా పెరగలేదని కూడా చెబుతోంది. వ్యవసాయంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సర్వే ప్రస్తావించింది.

ప్రపంచ సంక్షోభం, సరఫరా గొలుసు అంతరాయాలు, రుతుపవన అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడిని పరిపాలనా, ద్రవ్య విధానాల ద్వారా సమర్ధవంతంగా నిర్వహించినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. దీని కారణంగా FY 23లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.7 శాతంగా ఉంది. ఎఫ్‌వై24లో 5.4 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ సమస్యలు, సరఫరా గొలుసు అంతరాయాలు, రుతుపవనాల మార్పుల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తోంది.

ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్‌బీఐ అంచనా ప్రకారం సాధారణ రుతుపవన వర్షాలు, బాహ్య లేదా విధానపరమైన షాక్‌లు లేని సందర్భంలో రిటైల్ ద్రవ్యోల్బణం FY2025లో 4.5 శాతం నుంచి FY2026లో 4.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. మరోవైపు IMF భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2024లో 4.6 శాతం, 2025లో 4.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2024, 2025లో గ్లోబల్ ధరలు తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

2023-24లో ప్రపంచ ఇంధన ధరల సూచీ భారీగా క్షీణించింది. మరోవైపు ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించింది. ఫలితంగా రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది.

ఆగస్టు 2023లో ప్రభుత్వం దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ల ధరలు తగ్గించింది. దేశంలోని అన్ని మార్కెట్‌ల్లో ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గింది. అప్పటి నుంచి ఎల్‌పీజీ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2023 నుంచి దిగొస్తోంది.

అననుకూల వాతావరణ పరిస్థితులు ఆహార ఉత్పత్తిని అడ్డుకున్నాయి. ఉల్లిగడ్డ, టమాటా ధరలు పెరిగేలా చేశాయి.నిర్దిష్ట పంట తెగులు, రుతుపవన వర్షాలు ముందుగానే కురవడం, రవాణా అంతరాయాల కారణంగా టమోటా ధరలు పెరిగాయి.రబీ ఉల్లి నాణ్యత దెబ్బతినడం, ఖరీఫ్‌లో ఉల్లిని ఆలస్యంగా విత్తడం, ఇతర దేశాల వాణిజ్య సంబంధిత చర్యల కారణంగా ఉల్లి ధరలు పెరిగాయి. బలమైన డిమాండ్, ఎగుమతి పరిమితుల కారణంగా ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే 2015-2019 స్థాయిల కంటే ఎక్కువగానే ఉండవచ్చు.