నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ( Budget Sessions) జరుగుతున్న సంగతి విదితమే. సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్‌ను అమృత్‌ కాలానికి (Amrit Kaal) చెందిన బడ్జెట్‌గా మోదీ అభివర్ణించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ పూర్తి చేసే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామన్నారు.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి ఈరోజు సైకిల్‌పై పార్లమెంటుకు చేరుకున్నారు. నేను నా జీవితంలో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నానని, ఓ రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ మీద వచ్చానని తెలిపారు.  మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)