హైదరాబాద్ నగరంలోని మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది. దీంతో ఆగ్రహం చెందిన కానిస్టేబుల్ తన భార్య, సోదరిని పిలిచి వృద్ధురాలి మీద దాడి చేయించాడు.60 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దుతూ, కర్రతో దాడి చేశారు కానిస్టేబుల్ కుటుంబసభ్యులు. ఈ ఘటనపై మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన విజువల్స్ సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Elderly Woman Assaulted by Constable’s Relatives
కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై దారుణంగా దాడి చేసిన కానిస్టేబుల్ కుటుంబసభ్యులు
హైదరాబాద్ - మాదన్నపేటలో దారుణం
తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని ప్రశ్నించిన వృద్ధురాలు
దీంతో తన భార్య,… pic.twitter.com/W5bwZ1Ngx2
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)