Dearness Allowance Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్, డీఏ 4శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం, ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయం

ఉద్యోగులందరికీ నాలుగు శాతం కరవు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన భేటీలో కేబినెట్‌ (Cabinet) ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది.

Indian Rupee (photo Credit- ANI)

New Delhi, March 24: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Govt Employees) కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ నాలుగు శాతం కరవు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన భేటీలో కేబినెట్‌ (Cabinet) ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. ఈ పెంపుతో కేంద్ర ఖజానాపై అదనంగా రూ. 12,815 కోట్లు భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలిపారు. జనవరి 1, 2023 నుంచి ఈ పెంపు వర్తిస్తుందన్నారు. పెరుగుతున్న ధరల నుంచి కేంద్రం ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరటగా కేంద్రం డీఏను ఇస్తుంది. వినియోగదారుల ధర సూచీ ఆధారంగా కేంద్రం డీఏను లెక్కిస్తుంది.

తాజా నిర్ణయంతో కేంద్రం పరిధిలోని 47.58 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షర్లకు (Pensioners) లబ్ధి చేకూరనుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.



సంబంధిత వార్తలు