Goa Horror: అమ్మతనానికే మాయని మచ్చ, నాలుగేళ్ల కొడుకును బెంగుళూరు నుంచి గోవాకి తీసుకువెళ్లి చంపిన కసాయి తల్లి, దారుణ హత్య వెనుక ఒళ్లు గగుర్పొడిచే నిజాలు ఇవిగో..
ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి.. గోవా (Goa) నుంచి కర్ణాటక (Karnataka) వరకు ట్యాక్సీలో ప్రయాణించింది.
Candolim, Jan 9: కర్ణాటకకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త (AI Company CEO) తన నాలుగేళ్ల కుమారుడిని అతి దారుణంగా హత్య (AI Company CEO Suchana Seth Allegedly Murders Four-Year-Old Son) చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి.. గోవా (Goa) నుంచి కర్ణాటక (Karnataka) వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..39 ఏళ్ల సుచనా సేథ్ బెంగుళూరులోని మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ కంపెనీ సీఈవోగా చేస్తున్నారు. గత శనివారం ఆమె తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్‌కు వెళ్లింది. కాండలిమ్‌లోని బనియన్ గ్రాండ్ హోటల్‌లోకి ఆమె శనివారం తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. అయితే సోమవారం ఆమె ఒంటరిగా చెక్ ఔట్ అయ్యింది. బెంగుళూరుకు ట్యాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ స్టాఫ్‌ను కోరింది. ఫ్లయిట్‌లో వెళ్లాలని కోరినా ఆమె ట్యాక్సీలోనే వెళ్లేందుకు మొగ్గు చూపింది.
సోమవారం ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి బుక్ చేసిన ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్‌లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కన్పించిన సుచనా.. వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కన్పించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
Here's ANI Video
వాళ్లు ట్యాక్సీ డ్రైవర్‌కు కాల్ చేశారు. కుమారుడి గురించి చెప్పాలని సీఈవో సుచనాను పోలీసులు ఫోన్‌లోనే అడిగారు. అయితే ఆమె తన ఫ్రెండ్ అడ్రస్ ఇచ్చింది. అక్కడ తన కుమారుడు ఉన్నట్లు ఆమె చెప్పింది. కానీ ఆ అడ్రస్ ఫేక్ అని పోలీసులు తెలుసుకున్నారు. ఈసారి గోవా పోలీసులు డ్రైవర్‌కు ఫోన్ చేసి కొంకణి భాషలో మాట్లాడారు.
సుచనాకు అర్థం కావద్దు అని అలా చేశారు. దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్‌కు పోలీసులు ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్ నేరుగా తన కారును సమీపంలో ఉన్న చిత్రదుర్గ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఆ కారులోని ఓ బ్యాగ్‌లో కుమారుడి శవం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని భర్త వెంకట రమణకు తెలియజేశారు. ఆయన కూడా ఏఐ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ కేసులో విచారణ నిమిత్తం సుచనాను పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు. లింకిడిన్ పేజీ ప్రకారం 100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సుచనా టాప్ ప్లేస్‌లో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నట్లు ఆమె లింకిడిన్‌లో ఉంది. డేటా సైన్స్ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడంలో ఆమెకు 12 ఏళ్ల అనుభవం ఉన్నది.
తన కుమారుడిని హత్య చేయడానికి 3 నెలల ముందు ఇన్‌స్టాలో చివరి పోస్టు పెట్టింది. అక్వేరియం వద్ద ఆడుకుంటున్న కుమారుడి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. వాట్ విల్ హ్యాపెన్ అని ఆ ఫోటోకు ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే సుచనా సేథ్ తన భర్త నుంచి దూరంగా ఉంటోందని, ఆ ఇద్దరి మధ్య విడాకులు తుది దశలో ఉన్నాయని, కానీ మర్డర్ వెనుక ఉన్న అసలు కారణం తెలియదని నార్త్ గోవా ఎస్పీ నిదిన్ వాల్సన్ తెలిపారు.
సుచనా భర్త వెంకట్ రామన్ ఇండోనేషియాలో ఉన్నాడు. అయితే విడాకుల్లో భాగంగా.. కుమారుడిని ప్రతి ఆదివారం తండ్రి వద్దకు తీసుకువెళ్లాలన్న ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కానీ తండ్రి వద్దకు కుమారుడిని తీసుకువెళ్లడం ఇష్టంలేకనే ఆ పిల్ల వాడిని తల్లి చంపినట్లు వాదనలు వినిపిస్తున్నాయి.