Caught On Cam: ఘోర విషాదం వీడియో ఇదిగో, తాత కారు కింద పడి నలిగిపోయిన మనవడు, అనుకోకుండా జరిగిన ప్రమాదంతో శోక సంద్రంలో కుటుంబం

కారు పార్క్‌ చేస్తోన్న సమయంలో తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు(Child) నలిగిపోయాడు. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Child Killed After Grandfather Accidentally Drives Over Him in Kerala's Kasargod Shocking Visuals

కేరళ(Kerala)లోని కాసరగోడ్‌ జిల్లాలో అనుకోకుండా జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. కారు పార్క్‌ చేస్తోన్న సమయంలో తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు(Child) నలిగిపోయాడు. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వ్యక్తి వెనుక పటాకులు కాల్చిన వైనం.. కుప్పకూలి మృతి.. ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ లో ఘటన (వీడియోతో)

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక కారు లోపలికి వచ్చింది. దానిని గమనించిన ఒక పిల్లాడు పక్కకు జరిగిపోయాడు. అయితే.. అది తమ తాత కారు అని గుర్తుపట్టి రెండేళ్ల చిన్నారి మాత్రం ఎదురుగా వెళ్లాడు. కానీ ఆ విషయాన్ని అతడి తాత గమనించుకోలేకపోయాడు. వాహనాన్ని పార్క్‌ చేసేందుకు పక్కకు తిప్పడంతో.. దాని టైర్‌ కింద చిన్నారి నలిగిపోయాడు.

Here's Video

ఈ విషయాన్ని పక్కనున్న మరో పిల్లాడు గుర్తించి కేకలు వేయడంతో.. ఏదో ప్రమాదం జరిగిందని కారులోని వ్యక్తి కిందికి దిగాడు. ఇంతలోనే అక్కడున్న పిల్లాడు కారు కిందకు దూరి, చిన్నారిని బయటకు లాగాడు. దీంతో తన కారు కింద నలిగిపోయిన మనవడిని చూసి, ఆ తాత తల్లడిల్లిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ పసివాడు తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.