Chilling Car Stunt: ఫుల్లుగా తాగి కారు స్టంట్‌ చేయబోయి ఓ వృద్ధుడి ప్రాణాలు తీశారు! హర్యానాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన, వైన్ షాపు ముందే కారుతో స్టంట్స్ చేసిన యువకులు, సీసీటీవీలో రికార్డయిన దుర్ఘటన, నిందితుల్లో ఒకరు డీసీపీ ఆఫీసులో ఎంప్లాయ్‌

ఇంతలోనూ ఊహించని ఘోరం జరిగిపోయింది. కారు వచ్చి ఢీకొట్టేసింది. ఈ ఘటనలో 50ఏళ్ల వృద్ధుడు స్పాట్ లోనే మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. కారు వేగంగా వచ్చిన వ్యక్తులను ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Screen Garb from Viral Video

Gurugram, NOV 09: హర్యానాలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు చేసిన పని ఓ వృద్ధుడి ప్రాణం (Death) తీసింది. కారుతో స్టంట్ (Car Stunt) చేయబోయిన అతగాడు.. వేగాన్ని నియంత్రించలేక ఓ వ్యక్తిని గుద్ది చంపేశాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral Video) మారింది. ఆ వీడియో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంది. గుర్ గావ్ లో (Gurugram) ఈ ఘటన జరిగింది. అది తెల్లవారుజామున 2 గంటల సమయం. ఓ వ్యక్తి తాగిన మత్తులో ఉన్నాడు. కారుతో (Maruthi Ertiga) స్టంట్ చేయాలని అనుకున్నాడు. ఓ లిక్కర్ షాప్ (Wine Shop) ముందు స్టంట్ (Car stunt) చేసేందుకు ప్రయత్నించాడు. చాలా వేగంగా వాహనాన్ని నడిపాడు. అయితే, నియంత్రణ కోల్పోయాడు. అదే వేగంతో వచ్చి రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిల్చున్న కొందరు వ్యక్తులను కారుతో బలంగా ఢీకొట్టాడు.

కారు వేగంగా తమ వైపు వస్తుండటాన్ని గమనించిన ఆ వ్యక్తులు పక్కకు జరిగే ప్రయత్నం చేశారు. ఇంతలోనూ ఊహించని ఘోరం జరిగిపోయింది. కారు వచ్చి ఢీకొట్టేసింది. ఈ ఘటనలో 50ఏళ్ల వృద్ధుడు స్పాట్ లోనే మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. కారు వేగంగా వచ్చిన వ్యక్తులను ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Indian Railway: ఇండియన్ రైల్వే అదిరిపోయే ఫీచర్, మీరు నిద్రపోయినా మీ గమ్యస్థానం రాగానే అలర్ట్, డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి 

కారు వేగంగా వచ్చిన వ్యక్తులను ఢీకొన్న తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. వీడియో చూసినోళ్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. రెండు కార్లను సీజ్ చేశారు. నిందితుల్లో ఒకడు డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తాడని, మరో ముగ్గురు ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తారని పోలీసులు గుర్తించారు. కారుతో తొలుత ఓ స్టంట్ చేశారని, రెండో స్టంట్ చేసే సమయంలో ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కారుతో ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టగా.. అందులో ఓ వృద్ధుడు చనిపోయాడన్నారు. ఈ ఘటనలో నిందితులందరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.