CBI Seals Bahanaga Bazar Railway Station: ఇకపై ఆ స్టేషన్‌లో రైళ్లు ఆగవు, బహనాగ బజార్ రైల్వే స్టేషన్‌ను సీజ్‌ చేసిన సీబీఐ, పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని విచారణ

ఈ నేపథ్యంలో ఆ స్టేషన్‌లో రైళ్లు ఆగబోవని రైల్వే అధికారులు శనివారం తెలిపారు. సిగ్నల్‌ వ్యవస్థలో మార్పులు చేయడం వల్ల మూడు రైళ్లు ఢీకొన్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ అనుమానం వ్యక్తం చేశారు.

Odisha Train Tragedy (Photo Credits: Twitter/@ANI)

Balasore, June 10: ఒడిశాలో గత శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంపై (Odisha train crash) దర్యాప్తు చేస్తున్న సీబీఐ బాహానగా బజార్‌ రైల్వే స్టేషన్‌ను సీల్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్‌లో రైళ్లు ఆగబోవని రైల్వే అధికారులు శనివారం తెలిపారు. సిగ్నల్‌ వ్యవస్థలో మార్పులు చేయడం వల్ల మూడు రైళ్లు ఢీకొన్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తును ఆయన కోరారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఆ స్టేషన్‌తోపాటు లాగ్‌ బుక్‌, రిలే ప్యానల్‌, ఇతర పరికరాలను సీజ్‌ చేశారని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన రిలే ఇంటర్‌ లాకింగ్‌ ప్యానల్‌కు సీబీఐ సీలు వేసిందని చెప్పారు. దీంతో రైలు సిబ్బంది సిగ్నలింగ్‌ వ్యవస్థను కంట్రోల్‌ చేసే వీలు లేదన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి నోటీసు జారీ చేసే వరకు బాహానగా బజార్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు లేదా గూడ్స్ రైళ్లు కూడా ఆగవని వెల్లడించారు.

Hyderabad: వీడియో ఇదిగో, మేకలు తమ‌ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయని అడిగినందుకు తల్వార్లతో, రాడ్లతో దాడి చేసిన మేకల యజమానులు 

కాగా, ప్రతి రోజూ ఈ రైల్వే స్టేషన్‌ మీదుగా సుమారు 170 రైళ్లు ప్రయాణిస్తాయని ఆదిత్య కుమార్‌ తెలిపారు. కేవలం ఏడెనిమిది ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే ఈ స్టేషన్‌లో నిమిషం పాటు ఆగుతాయని చెప్పారు. అయితే మూడు రైళ్ల ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులపాటు ఎలాంటి రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగవని వివరించారు. మరోవైపు గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వందలాది మంది వికలాంగులుగా మారారు.