CDS Appointment System: సీడీఎస్ నియామకంలో కేంద్రం సంచలన నిర్ణయం, సీడీఎస్ అర్హత పరిధిని సడలిస్తూ కీలక మార్పులు, ఇక రిటైరైన అత్యున్నత అధికారులకు కూడా సీడీఎస్ బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం

62 ఏళ్ల వయసులోపు సర్వీసులో కొనసాగుతున్న లేదా రిటైర్డ్ అయిన లెఫ్టనెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్‌‌లు కూడా సీడీఎస్ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా (CDS Appointment System) అర్హులను చేస్తూ రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం నూతన మార్గదర్శకాలను (Center widens selection pool) జారీ చేసింది.

General MM Naravane receives guard of honour at the South Block lawns prior to relinquishing his position as Chief of the Army Staff, in New Delhi (Photo-PTI)

New Delhi, June 7: భారత సాయుధ దళాల సీడీఎస్(Chief Of Defence Staff) పోస్టుకు అధికారుల అర్హతల పరిధిని సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.62 ఏళ్ల వయసులోపు సర్వీసులో కొనసాగుతున్న లేదా రిటైర్డ్ అయిన లెఫ్టనెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్‌‌లు కూడా సీడీఎస్ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా (CDS Appointment System) అర్హులను చేస్తూ రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం నూతన మార్గదర్శకాలను (Center widens selection pool) జారీ చేసింది.

ఈ మార్పులతో త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ద్వితీయ అత్యున్నత స్థాయి ర్యాంకు (క్రియాశీల) ఆఫీసర్లు కూడా తమ సీనియర్ అధికారులైన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ చీఫ్‌ల సమానంగా సీడీఎస్ పోస్టు అర్హత కలిగివుండనున్నారు. ఈ మార్పులతో సీడీఎస్ అర్హుల సంఖ్య పెరిగినట్టయింది. కాగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ గతేడాది డిసెంబరు 8న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పటినుంచి సీడీఎస్ గా ఇంకా ఎవరినీ నియమించలేదు.

తాజాగా సీడీఎస్ పదవి కోసం... రిటైరైన సైనికాధికారులు కూడా పరిగణనలోకి వస్తారని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు మూడు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన రిటైర్డ్ చీఫ్ లు కూడా సీడీఎస్ అయ్యే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న వారు, సర్వీసులో ఉన్న త్రీస్టార్ ఆఫీసర్లు, చీఫ్ గా వ్యవహరించి పదవీ విరమణ చేసిన 62 ఏళ్ల లోపు వయసున్న వారు, 62 ఏళ్ల లోపు వయసున్న రిటైర్డ్ త్రీస్టార్ ఆఫీసర్లు... సీడీఎస్ పదవి కోసం అర్హులవుతారని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో... రిటైర్డ్ అయిన అధికారులను కూడా పరిశీలనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

యోధుడా ఇక సెలవు, బరువెక్కిన హృదయంతో తుది వీడ్కోలు పలికిన యావత్ భారతం, సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌కు సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తి

పరిస్థితుల ఆధారంగా అవసరమైతే సీడీఎస్ సర్వీస్ రిటైర్మెంట్ వయసు గరిష్ఠంగా 65 సంవత్సరాలకు కూడా పెంచే అవకాశం ఉందని స్పష్టంచేసింది. 3 నోటిఫికేషన్ల ప్రకారం ఎయిర్ మార్షల్ లేదా ఎయిర్ చీఫ్ మార్షల్ లేదా ఈ హోదాలతో రిటైర్ అయిన అధికారుల వయసు 62 ఏళ్లు మించకపోతే సీడీఎస్ పోస్టుకు ఎంపిక చేయవచ్చు అని కేంద్రం వివరించింది. ఇదే తరహాలో ఆర్మీ యాక్ట్ 1950, నేవీ యాక్ట్ 1957 కింద కూడా నోటిఫికేషన్లు విడుదల చేసింది.

సీడీఎస్ బిపిన్ రావత్‌కు నివాళి అర్పించిన విదేశీ అంబాసిడ‌ర్లు, సైన్యాధిప‌తులు

ఈ మార్పులతో జనరల్ బిపిన్ రావత్ తర్వాత భారత్‌కు రెండవ సీడీఎస్‌ను ఎంపిక జరగనుంది. గతేడాది డిసెంబర్ 8న జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మిలిటరీ హెలికాఫ్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. హెలికాఫ్టర్‌లో ఉన్న మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సీడీఎస్ పోస్టును భర్తీ చేయలేదు. బిపిన్ రావత్ భారత తొలి సీడీఎస్‌గా నియమితులైన విషయం తెలిసిందే. సీడీఎస్ రక్షణశాఖలో మిలిటరీ అఫైర్స్ విభాగం కార్యకలాపాలను నిర్వహిస్తారు. త్రివిధ దళాల సమన్వయకర్తగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now