ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ చీఫ్ రావ‌త్ దంప‌త‌లుకు ఇవాళ సైనిక లాంఛ‌నాల‌తో అంతిమ వీడ్కోలు (CDS Bipin Rawat Last Rites) జరగనున్నాయి. బ‌రార్‌ స్క్వేర్ శ్మ‌శాన‌వాటిక‌లో ప‌లువురు రావ‌త్ భౌతిక‌కాయానికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. శ్రీలంక ఆర్మీ క‌మాండ‌ర్ జ‌న‌ర‌ల్ శ‌వేంద్ర సిల్వా, రాయ‌ల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ ఆఫీస‌ర్ బ్రిగేడియ‌ర్ దోర్జీ రింన్‌చెన్‌, నేపాల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ బాల్ కృష్ణ కార్కి, బంగ్లాదేశ్ ఆర్మ‌డ్ ఫోర్సెస్ డివిజ‌న్ ఆఫీస‌ర్ లెఫ్టినెంట్ వాక‌ర్ ఉజ్ జ‌మాన్‌లు రావ‌త్ దంప‌తుల పార్దీవ‌దేహాల‌కు పుష్ప నివాళి అర్పించారు.

బ్రిటీష‌న్ హై క‌మీష‌న‌ర్ అలెక్స్ ఎల్లిస్ కూడా పుష్ప నివాళి అర్పించారు. రావ‌త్ మృతి ప‌ట్ల ఆయ‌న తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఫ్రాన్స్ అంబాసిడ‌ర్ ఎమ్మాన్యువెల్ లినాయిన్ కూడా రావ‌త్ దంప‌తుల‌కు పుష్పాంజ‌లి ఘ‌టించారు. బ‌రార్‌ స్క్వేర్ శ్మ‌శాన‌వాటిక‌లో (Brar Square crematorium in Delhi) ..కొంత సేపు రావ‌త్ దంప‌తులు శ‌వ‌పేటిక‌ను శ్ర‌ద్ధాంజ‌లి కోసం ఉంచారు. బిపిన్ శ‌వ‌పేటిక‌ను జాతీయ జెండాతో క‌ప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)