CDS Bipin Rawat Funeral: యోధుడా ఇక సెలవు, బరువెక్కిన హృదయంతో తుది వీడ్కోలు పలికిన యావత్ భారతం, సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌కు సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తి
CDS Bipin Rawat Funeral

New Delhi, Dec 10: హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat Funeral) దంపతులకు యావత్ భారతదేశం కన్నీటి వీడ్కోలు పలికింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రార్ స్మశాన వాటికలో రావత్, ఆయన సతీమణి మధులిక పార్థీవ దేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారులు ప్రముఖుల నివాళులు అనంతరం కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు (Bipin Rawat Funeral) జరిపారు. రావత్ దంపతుల పార్థీవ దేహాలపై కప్పిన భారత జాతీయ పతాకాన్ని కుమార్తెలకు అందజేశారు.

సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. భార‌త తొలి సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌కు 17 తుపాకుల‌తో వంద‌నం (17-gun salute as nation bids farewell) స‌మ‌ర్పించారు. అంత్య‌క్రియ‌ల‌ స‌మ‌యంలో త్రివిధ ద‌ళాలు 17 గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పించాయి. ఇంకా సుమారు 800 మంది త్రివిధ‌ద‌ళాల‌కు చెందిన సిబ్బంది ద‌హ‌న సంస్కారాల్లో పాల్గొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డీఆర్ఢీఓ చీఫ్ జి సతీష్ రెడ్డి , పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరై తుది వీడ్కోలు పలికారు. అంత‌క‌ముందు ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని విదేశీ అంబాసిడ‌ర్లు, ఆర్మీ నాయ‌కులు ప్రార్థించారు. పుష్ప గుచ్ఛాలు అర్పించారు. శ్రీలంక‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌లు హాజ‌ర‌య్యారు. 800 మంది త్రివిధ ద‌ళాల సైనికులు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు.

హెలికాప్ట‌ర్ ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం, త్రివిధ దళాల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నడుస్తోంది, దయచేసి అసత్య ప్రచారాలు ఆపాలని కోరిన వాయుసేన

రావ‌త్ దంప‌తుల ద‌హ‌న సంస్కారాల‌కు భారీ సంఖ్య‌లో విదేశీ అతిథులు హాజ‌ర‌య్యారు. హిందూ వైదిక ధ‌ర్మం ప్ర‌కారం అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. రావ‌త్ ఇద్ద‌రు కుమార్తెలు కృతిక‌, త‌ర‌ణిలు ఆ పూజ‌ల్లో పాల్గొన్నారు. బిపిన్‌ రావ‌త్, మ‌ధులికా రావ‌త్‌ దంప‌తుల పార్డీవ‌దేహాల‌ను ఒకే చితిపై పెట్టారు. సాంప్ర‌దాయం ప్ర‌కారం రావ‌త్ కుమార్తెలు ద‌హ‌న ధ‌ర్మాలు చేప్ట‌టారు. ఇద్ద‌రు కుమార్తెలు రావ‌త్ దంప‌తుల చితికి నిప్పు అంటించారు.

ఆర్మీ గ‌న్ సెల్యూట్ ఎందుకు

ప్రోటోకాల్ ప్ర‌కారం సీనియర్‌ అధికారులు చనిపోయినప్పుడు ఆర్మీ గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పిస్తోంది. తుపాకీ వంద‌నం సమ‌ర్పిస్తున్నారంటే ఆ అంత్య‌క్రియ‌లు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జ‌రుగున్న‌ట్టు అర్థం. రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. మ‌రి 17 గ‌న్ సెల్యూట్ ఎవ‌రికి స‌మ‌ర్పిస్తారు? ఎందుకు స‌మ‌ర్పిస్తారు? అనే ప్ర‌శ్న‌లు ప‌లువురిని ప‌లుక‌రిస్తున్నాయి.

భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్‌ అధికారులు చనిపోయినప్పుడు.. 21 గ‌న్ సెల్యూట్ నిర్వ‌హిస్తారు. అంటే గాల్లోకి 21 సార్లు కాల్పులు జ‌రిపి వంద‌నం స‌మ‌ర్పిస్తారు. త్రివిధ దళాల్లో ప‌ని చేసిన సీనియ‌ర్ ఆఫీస‌ర్లు మ‌ర‌ణిస్తే 17 గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పిస్తారు. భార‌త రాష్ట్ర‌ప‌తికి ప‌లు సంద‌ర్భాల్లో 21 గ‌న్ సెల్యూట్ స‌మ‌ర్పిస్తారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణం చేసిన రోజున కూడా తుపాకీ వంద‌నం స్వీక‌రిస్తారు. ఇక ఇండిపెండెన్స్‌, రిప‌బ్లిక్ డే వేడుక‌ల సంద‌ర్భంగా రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు.. 21 తుపాకీ వందనం స్వీకరిస్తారు. W 21 గ‌న్ సెల్యూట్ సంప్ర‌దాయం బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి వార‌సత్వంగా భార‌త‌దేశం పొందింది.