Telugu States CMs in Delhi: ప్రధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి, విభజన సమస్యలపై తెలుగురాష్ట్రాల సీఎంల సమావేశానికి ముందు కీలక పరిణామం
ఉదయం 10.15 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు.
New Delhi , July 04: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra modi) ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth reddy) విడివిడిగా సమావేశం కానున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. అలాగే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ ఇరువురు సీఎంలు భేటీ అవుతారు. ఏపీ, తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీ, అమిత్ షాతో సీఎంలు చర్చలు జరుపుతారు.
హైదరాబాద్‌లో శనివారం చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్న నేపథ్యంలో వారి ఢిల్లీ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో చంద్రబాబు, రేవంత్ రెడ్డి విడివిడిగానూ భేటీ అవుతారు. ఇవాళ, రేపు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర సర్కారు మద్దతు, సహకారం ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. అలాగే, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.