Chandrababu (photo-Video Grab)

Vjy, July 3: రాజధాని అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి కోసం తాము పడిన కష్టం అంతా వృథా అయిందన్నారు. అయిదేళ్ల తర్వాత అమరావతిని చూసినప్పుడు తనకు ఎంతో బాధ కలుగుతోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇంత కష్టపడితే రాజధాని పట్ల దుర్మార్గంగా వ్యవహరించారనే బాధ తనకు కలుగుతోందన్నారు. ఇది తనకు చేసిన ద్రోహం కాదని... జాతి ద్రోహమే అన్నారు.

ఇక, రాజధానిని అభివృద్ధి చేసి... మాది అమరావతి అని చెప్పుకునే పరిస్థితి రావాలన్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాజధాని అమరావతిలో విధ్వంసం సృష్టించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు.. యావత్‌ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి.. చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు.  ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, మాజీ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ బయోడేటా ఇదే..

అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరం. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సూచించారు. అమరావతి పేరును క్యాబినెట్‌లో వందశాతం అంగీకరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచాం. యమునా నది నీరు, పార్లమెంట్‌ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు.

దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారు. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్ర భవిష్యత్తును ఆకాక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలి. విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది. తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్‌కు ఇచ్చామని తెలిపారు. వీడియో ఇదిగో, ఏపీకి వచ్చేసిన బుల్డోజర్‌ సంస్కృతి, తిరువూరులో వైసీపీ భవనాన్ని కూల్చేందుకు కార్యకర్తలతో కలిసి బుల్డోజర్‌ను వెంటపెట్టుకుని వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌

9 వేల మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా జగన్‌ చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్‌ ఏం చేశారో ప్రజలే చూశారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది. ఇన్ని కిలోమీటర్ల రివర్‌ ఫ్రంట్‌ ఎక్కడా లేదు. ఒక వైపు గోదావరి, మరో వైపు కృష్ణా రెండు నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్‌ అందుబాటులో ఉంటుందన్నారు.

హైదరాబాద్‌ను పదేళ్లు కామన్ క్యాపిటల్‌గా చేశారని... ఇప్పుడు అది తెలంగాణకు మాత్రమే రాజధాని అన్నారు. ఈలోగా అమరావతిని అభివృద్ధి చేసుకుని వుండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరువల్ల పెట్టుబడిదారులకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరలా సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు.

అలాగే, పెట్టుబడులు పెట్టేవారికి ఇప్పుడు భయం ఉందన్నారు. ఆ భూతం, దుర్మార్గుడు (జగన్‌ను ఉద్దేశించి) ఇక్కడే ఉంటాడు కదా... మేం రిస్క్ ఎందుకు చేయాలని వారు అనుకుంటారు కదా అన్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పోయిందన్నారు. ఇప్పుడు ఎవరిని అడిగినా చేస్తాం.. చూస్తామని చెబుతున్నారని... ఇప్పుడు మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.

2019లో అధికారంలోకి వచ్చాక ప్రజావేదిక కూల్చివేత నుంచి విధ్వంసం ప్రారంభమైందని మండిపడ్డారు. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రకటన, జీఎన్ రావు కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ... ఇలా ఎన్ని విన్యాసాలు చేయాలో అన్ని విన్యాసాల ద్వారా విధ్వంసం చేశారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఎన్నో వెసులుబాట్లు నిలిపివేశారన్నారు.

సింగపూర్ కన్సార్టియం వన్ అఫ్ ది బెస్ట్ అని... కానీ దానిపై ఆరోపణలు చేసి తప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాజధానిని మారుస్తామని చెప్పిన వారు చరిత్రలో లేరన్నారు. కానీ ఇలాంటి తిక్కవారి వద్ద కూడా రాష్ట్రాన్ని, రాజధానిని కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తామన్నారు. అసలు ఏపీ, రాజధాని ఓ కేస్ స్టడీ అన్నారు.

హ్యాపీ నెస్ట్ రూ.720 కోట్ల ప్రాజెక్ట్ అని... దీని ద్వారా ఆరోజు రూ.57 కోట్లు లాభం వచ్చి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడంతో పాటు రూ.165 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి కానీ భవనాల నిర్మాణాల ఖర్చు పెరిగిందన్నారు. నాలెడ్జ్ ఎకానమీలోనే లక్షలాది ఉద్యోగాలు వచ్చాయని... అమరావతి అభివృద్ధి అయి ఉంటే ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కేవన్నారు.

తాను ముందుచూపుతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానన్నారు. ఈ నగరం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. కానీ ఏపీలో ఈ అయిదేళ్ల పాలన కారణంగా వెల్త్ క్రియేషన్ తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2019లో జడ్జిల క్వార్టర్లు, ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీల క్వార్టర్లు ఎలా ఉన్నాయో... ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపించారు.

తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానన్నారు. 2004లో తానే కంటిన్యూ అయి ఉంటే హైదరాబాద్ వేరే లెవల్‌లో ఉండేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధికి పదేళ్లు పట్టిందన్నారు. అమరావతికీ అదే వర్తిస్తుందన్నారు. తాను కంటిన్యూ అయి ఉంటే వేరేలా ఉండేదన్నారు. అయినప్పటికీ తాను పాజిటివ్‌గా ఆలోచిస్తానని... ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభిస్తానన్నారు. వెనక్కి పోయే ప్రసక్తి లేదన్నారు. అభివృద్ధి కోసం ఎవరు సలహా ఇచ్చినా స్వీకరిస్తానన్నారు.