India vs Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ రీషెడ్యూల్, కొత్త తేదీ ఎప్పుడంటే..?

అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్‌లో నవరాత్రి పండుగ కారణంగా భారత్-పాకిస్థాన్ సహా 6 మ్యాచ్‌లు రీషెడ్యూల్ కానున్నాయి.

india vs pakistan

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ODI ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్‌లో నవరాత్రి పండుగ కారణంగా భారత్-పాకిస్థాన్ సహా 6 మ్యాచ్‌లు రీషెడ్యూల్ కానున్నాయి. టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది. కాగా భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ల మధ్య అతిపెద్ద మ్యాచ్‌ జరగనుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ గ్రేట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ అక్టోబర్ 14కు రీషెడ్యూల్ అయ్యింది.

దీంతో పాటు అక్టోబరు 12న జరగనున్న పాకిస్థాన్‌ ఆడనున్న మరో మ్యాచ్‌ను మార్చనున్నారు. ఈ మ్యాచ్ శ్రీలంకతో జరగాల్సి ఉంది. ఇది ఇప్పుడు హైదరాబాద్‌లో అక్టోబర్ 12కి బదులుగా అక్టోబర్ 10న జరగనుంది. కాగా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య అక్టోబర్ 9న హైదరాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్ ఇప్పుడు అక్టోబర్ 12న జరగనుంది.

Pakistan Flour Crisis: గోధుమ పిండి కోసం విలవిలలాడుతున్న పాకిస్తాన్ ...

నిజానికి నవరాత్రుల మొదటి రోజు అక్టోబర్ 15న వస్తోంది. అటువంటి పరిస్థితిలో, నవరాత్రి పండుగ కారణంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని అప్రమత్తం చేశాయి. అంతేకాదు ప్రపంచకప్ సమయంలో నవరాత్రి పండుగే కాదు.. దీపావళి, దసరా లాంటి పండుగలు కూడా రాబోతున్నాయి. అటువంటి పరిస్థితిలో, మ్యాచులను సజావుగా పూర్తి చేయడానికి BCCI చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భారత జట్టు కొత్త షెడ్యూల్ మ్యాచుల తేదీలు ఇవే..

08 అక్టోబర్,  భారత్ v ఆస్ట్రేలియా, చెన్నై

11 అక్టోబర్,  భారత్ v ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ

14 అక్టోబర్,  భారత్ v పాకిస్తాన్, అహ్మదాబాద్

19 అక్టోబర్,  భారత్ v బంగ్లాదేశ్, పుణె

22 అక్టోబర్,  భారత్ v న్యూజిలాండ్, ధర్మశాల

29 అక్టోబర్,  భారత్ v ఇంగ్లాండ్, లక్నో

02 నవంబర్,  భారత్ v నెదర్లాండ్స్, ముంబై

05 నవంబర్,  భారత్ v సౌతాఫ్రికా, కోల్‌కతా

11 అక్టోబర్,  భారత్ నవంబర్ vs శ్రీలంక, బెంగళూరు