Chennai Rains: భారీ వర్షాలకు చెన్నై విలవిల, స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం, విమాన రాకపోకలు ఆలస్యం, నేడు భారీ వర్షాలు పడే అవకాశం

దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించింది.

Chennai Rains

తమిళనాడు రాజధాని చెన్నైని (Chennai) భారీ వర్షాలు (Heavy rains)ముంచెత్తాయి. దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించింది. చెన్నై, కాంచీపురం (Kancheepuram), తిరువళ్లూరు (Thiruvallur), చెంగల్‌పట్టు (Chengalpattu)తోపాటు రాజధాని పరిసరాల్లోనీ తీర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. చైన్నైలోని మీనంబాక్కంలో (Meenambakkam) ఉదయం 5.30 గంటల వరకు 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు భారీగా నిలిచిపోయింది. వాహనాలు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు తీవ్ర వడగాల్పులు.. జాగ్రత్తగా ఉండాలంటూ భారత వాతావరణ విభాగం హెచ్చరిక

సోమవారం మధ్యాహ్నం వరకు ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రాత్రిపూట భారీ వర్షం కురుస్తుండడంతో అధికారులు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దోహా, దుబాయ్‌లతో సహా దాదాపు 10 ఇన్‌కమింగ్ విమానాలను బెంగళూరుకు మళ్లించడంతో విమానాశ్రయంలోని అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి, ఆ తర్వాత బయలుదేరడంపై కూడా ప్రభావం పడింది.చెన్నై నుంచి బయల్దేరాల్సిన 12కుపైగా అంతర్జాతీయ విమనాలకు ఆలస్యమయింది. చెన్నపట్నానికి రావాల్సిన ఆరు విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు.

అయితే ఈ నెల 21 వరకు చెన్నై, దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.వర్షాల నేపథ్యంలో వెల్లూరు, రాణిపేటతో పాటు చెన్నై, పొరుగు జిల్లాలైన చెంగల్‌పేట, కాంచీపురం, తిరువళ్లూరులోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. నగరం, దాని శివారు ప్రాంతాల్లో సోమవారం మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది.



సంబంధిత వార్తలు

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Telugu States Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. తెలంగాణను వణికిస్తున్న చలి-పులి

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif