Chennai Woman Married 4 Times: ఈజీ మనీ కోసం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువతి, ఐదో పెళ్లికోసం ట్రై చేస్తుండగా అడ్డంగా పోలీసులకు బుక్కయిన కిలాడీ, 12 ఏళ్లలో 32 సిమ్ కార్డులు, వాడినట్లు గుర్తింపు
చూస్తే ఇంట్లో నగలు, నగదు(Cash) లేవు. డబ్బు, నగలు తీసుకుని అభినయ పారిపోయిందనే విషయం అర్థమైంది. ఆమె ఆచూకీ కోసం వెదికితే కనిపించలేదు. ఆమె ఉపయోగించే రెండు ఫోన్ నెంబర్లు పనిచేయలేదు. ఇక చేసేందేం లేక తాంబరం పోలీసులకు నటరాజన్ ఫిర్యాదు చేశాడు.
Chennai, DEC 03: డబ్బుల కోసం ఆన్ లైన్ మోసాలు చేసేవారిని చూసేఉంటాం. అంతెందుకు మాయమాటలు చెప్పి డబ్బులు గుంజేవాళ్లను చూశాం. కానీ తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం డబ్బుల సంపాదన కోసం పెళ్లిళ్లు (Marraiges) చేసుకోవడం మొదలు పెట్టింది. తమిళనాడుకు చెందిన అభినయ (Abhinaya)) అనే యువతికి ఉన్న డబ్బు ఆశ అంతా ఇంతా కాదు, తనకు విలాసవంతమైన జీవితం కావాలని ఏకంగా నలుగురు యువకులను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లైన ప్రతీసారి ఏడాది తిరక్కముందే వారి దగ్గరి నుంచి నగలు, నగదుతో ఉండాయించింది. ఆమెను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని పెళ్లిల్లు చేసుకునేదో. కానీ, నాలుగో భర్త నుంచి వచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తాంబరం పోలీసులు.. యువతిని చేధించి అరెస్ట్ (Arrest) చేశారు. అనంతరం విచారణలో ఈ పెళ్లిల్ల భాగోతం బయటపడింది.
తాంబరం రంగనాథపురం ప్రాంతానికి చెందిన నటరాజన్ (25) అనే యువకుడు ఆన్‌లైన్ ఫుడ్‌డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతడికి ముడిచ్చూరు రహదారిలోని బేకరీలో పనిచేస్తున్న అభినయ (28) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమ నుంచి పెళ్లి అనుకున్నారు. అనుకున్నట్టే నటరాజన్ తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఆగస్టు 29న అభినయను వివాహం చేసుకున్నాడు. కానీ, యువతి మాత్రం తన తల్లిదండ్రుల వివరాలు ఇవ్వలేదు. తన కుటుంబీకులతో గొడవలు పెట్టుకుని ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పింది. ఈ మాటలను నటరాజన్, అతడి కుటుంబ సభ్యులు నమ్మారు. అయితే పెళ్ళైన నెల రోజుల తర్వాత అభినయ కనిపించలేదు. చూస్తే ఇంట్లో నగలు, నగదు(Cash) లేవు. డబ్బు, నగలు తీసుకుని అభినయ పారిపోయిందనే విషయం అర్థమైంది. ఆమె ఆచూకీ కోసం వెదికితే కనిపించలేదు. ఆమె ఉపయోగించే రెండు ఫోన్ నెంబర్లు పనిచేయలేదు. ఇక చేసేందేం లేక తాంబరం పోలీసులకు నటరాజన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సెమ్మంజేరిలో దాగిన అభినయను అరెస్టు చేశారు. ఆమెను విచారించగా అప్పటికే ముగ్గురిని పెళ్ళాడి నగలు, నగదు దోచుకున్నట్లు వెల్లడైంది.
ముందుగా మన్నార్‌కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. కేవలం పదంటే పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్‌కుమార్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే యేడాది తర్వాత శెంథిల్‌కుమార్‌ను విడిచిపెట్టింది. ముచ్చటగా మూడోసారి కేళంబాక్కం చేరుకుని ఓ యువకుడిని ప్రేమ పేరుతో బోల్తా కొట్టించి పెళ్ళి చేసుకుంది. అక్కడా అంతే.. నగలు, నగదు దోచుకుని పరారై తాంబరం వెళ్లింది. ఇక చివరగా తాంబరంలో నటరాజన్‌ను నాలుగో వివాహం చేసుకుని పోలీసులకు చిక్కింది, నటరాజన్ ఫిర్యాదు స్వీకరించి అభినయను అరెస్ట్ చేసి విచారించగా గతంలోని మూడు పెళ్లిల్లు వెలుగుచూశాయి.
అభినయ వద్దనున్న 32 సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అభినయ మూడు, నాలుగో పెళ్లిల్లకు రెండో భర్త సెంథికుమార్ సహాయం చేశాడట. అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నటరాజన్ ఇంటి నుండి అభినయ దోచుకెళ్ళిన నగలు, నగదును రెండో భర్తకు ఇచ్చి అతడితో విలాసంగా గడిపినట్లు పోలీసులు కనుగొన్నారు. అతడి నుంచి వెళ్లినప్పుడు డబ్బు, నగలు ఏమీ దోచుకెళ్లలేదు.