Patna, DEC 03: బీహార్ లో మద్య నిషేధం అమల్లో (liquor Ban) ఉంది. అయినా రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులైపారుతోంది. రెండు రోజుల క్రితమే ఏకంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఖైదీలతో కలిసి మద్యం తాగుతు అడ్డంగా దొరికిపోయారు పోలీసులు. ఖైదీలతో కలిసి మద్యం తాగుతు ఉన్నతాధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు. దీంతో పోలీసులే పోలీసుల్ని అరెస్ట్ చేసిన పరిస్థతి వచ్చింది మద్యపాన నిషేధం ఉన్న బీహార్ (Bihar) లో..ఇటువంటి ఘటనలతో బీహార్ లో మద్యపాన నిషేధం ఏ తీరుగా అమలులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రిన్సిపల్ తో (School principal) సహా ముగ్గురు మరణించిన ఘటన చోటు చేసుకుంది. 2016లో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం (liquor Ban) విధించింది. అయినా రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోంది.
వైశాలి జిల్లాలోని మెహ్నర్‌లో జరిగిన విందుకు ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ వచ్చారు. చక్కగా మద్యం సేవించాడు. అతనితో పాటు చాలామంది ఆ విందులో మద్యం సేవించారు. ఆ విందులో మద్యం సేవించిన స్కూల్ ప్రిన్సిపల్ అనారోగ్యానికి గురైన అతడు మరణించాడు. అతని లాగానే అదే వేడుకకు వచ్చి మద్యం సేవించిన మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ మరణాలపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. వారి మరణాలకు కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఆ గ్రామంలో ఎవరు అనుమానాస్పదంగా మృతిచెందినా, మద్యం సేవించి చనిపోయినా తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు అధికారులు.