Chhattisgarh Blast: దంతెవాడలో మావోయిస్టుల ఘాతుకం, మందుపాతర పేలి 11 మంది జవాన్లు మృతి, సంతాపం వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్
ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Dantewada, April 26: చత్తీస్‌గఢ్‌లో దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఇంప్రూవైడ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని పేల్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది జవాన్లతోపాటు ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులు డిఫెన్స్ రీసెర్చ్‌కు చెందినవారిగా గుర్తించారు.
ఈ విషాదకర ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ స్పందించారు. జవాన్ల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఈ ఘటన గురించి సమాచారం అందింది. ఇలా జరగటం చాలా బాధాకరం.
Here's CM Video
మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మావోయిస్టులపై మా యుద్ధం కొనసాగుతుంది. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’ అని సీఎం అన్నారు.