Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్
‘‘ఇరవై రోజుల తర్వాత స్పందించిన చిన్నారి.. ఈరోజు స్పందిస్తోంది. అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
Hyd, Dec 24: 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారి తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇరవై రోజుల తర్వాత స్పందించిన చిన్నారి.. ఈరోజు స్పందిస్తోంది. అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడతూ. ‘‘ఘటన జరిగిన రోజుకీ.. ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. నాలుగైదు రోజుల నుంచి శరీరంలో కదలికలు ఉన్నాయి. ఇంజక్షన్ ఇస్తే చెయ్యి నొప్పి ఉన్నట్టు స్పందిస్తున్నాడు. రెండ్రోజుల నుంచి కళ్లు తెరిచి చూస్తున్నాడు.. కానీ, మమ్మల్ని గుర్తు పట్టడం లేదు. మీరు పక్కనే ఉండి పిలిస్తే క్రమక్రమంగా గుర్తు పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. వెంటిలేటర్ సపోర్టు తీసేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రూ.50 లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.25లక్షల చెక్కు, అల్లు అర్జున్ నుంచి రూ.10లక్షల డీడీ అందింది. మా వల్ల అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నారనే బాధతో కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను.
Sritej Father Reacts on His Child Health
నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదని తెలిపారు. నాకు అందరి సహకారం కావాలి. ఘటన జరిగిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ నాకు అండగా ఉన్నారనే సానుభూతితోనే కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పారు. దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ కూడా రెండు సార్లు వచ్చి పరామర్శించారు. అల్లు అర్జున్ మేనేజర్స్ ప్రతిరోజూ వచ్చి అప్‌డేట్ తీసుకుంటున్నారన్నారు.