Madhya Pradesh Road Accident: పెళ్లికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు, నదిలో బోల్తా పడిన పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు, ముగ్గురు చిన్నారులు సహా 5గురు మృతి

ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన తర్వాత కొందరు చిన్నారులు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు.

Representational Image (Credits: Facebook)

మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని దతియా (Datia) జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన తర్వాత కొందరు చిన్నారులు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బుహరా గ్రామం వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న నదిలో బోల్తాపడింది.

వీడియో ఇదిగో, ప్రేమించడం లేదని విద్యార్థినిపై కొడవలితో దాడి, పూణేలో షాకింగ్ ఘటన

ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) తెలిపారు. కాగా బాధితులంతా గ్వాలియర్ లోని బిల్హేటి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వారు తమ కుమార్తె వివాహం కోసం తికమ్‌ఘర్‌ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif