Ravi Shankar Prasad: చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్, చైనీస్ యాప్స్ బ్యాన్‌ను డిజిటల్ స్ట్రైక్‌గా అభివర్ణించిన కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్

దీనిపై కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ (Union Minister Ravi Shankar Prasad) స్పందించారు. చైనా యాప్‌ల నిషేధాన్ని ఆయ‌న డిజిటల్ స్ట్రయిక్‌గా (Banning Chinese apps a digital strike) అభివ‌ర్ణించారు. దేశ ప్ర‌జ‌ల డేటాను సుర‌క్షితంగా ఉంచేందుకే చైనా యాప్‌ల‌ను బ‌హిష్క‌రించామ‌ని, ఇది డిజిట‌ల్ దాడి అని ఆయ‌న అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Union Minister Ravi Shankar Prasad (Photo Credits: IANS)

New Delhi, July 2: చైనా ఇండియా సరిహద్దు ప్రాంతం ల‌డ‌క్‌లో భారత్ సైనికుల‌పై చైనా క్రూరమైన దాడి చేసిన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం (India Govt) దానికి ప్ర‌తీకారంగా డ్రాగ‌న్‌ దేశానికు చెందిన 59 యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ (Union Minister Ravi Shankar Prasad) స్పందించారు. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన

చైనా యాప్‌ల నిషేధాన్ని ఆయ‌న డిజిటల్ స్ట్రయిక్‌గా (Banning Chinese apps a digital strike) అభివ‌ర్ణించారు. దేశ ప్ర‌జ‌ల డేటాను సుర‌క్షితంగా ఉంచేందుకే చైనా యాప్‌ల‌ను బ‌హిష్క‌రించామ‌ని, ఇది డిజిట‌ల్ దాడి అని ఆయ‌న అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. చైనా ట్విట్టర్‌ను మూసేసిన ప్రధాని మోదీ, వీబోలో పాత పోస్టులను డిలీట్ చేస్తున్న అధికారులు, అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడానికి సమయం పట్టే అవకాశం

భార‌తదేశం శాంతిని కాంక్షిస్తున్న‌ద‌ని, కానీ ఎవ‌రైనా చెడు దృష్టితో చూస్తే వారికి త‌గిన బ‌దులు ఇస్తామ‌న్నారు. సోమ‌వారం రోజున భార‌త్ 59 చైనా యాప్‌ల‌ను బ‌హిష్క‌రించింది. దాంట్లో పాపుల‌ర్ యాప్‌లైన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజ‌ర్‌, స్కామ్‌, షేర్ఇట్‌లు ఉన్నాయి. ల‌డ‌ఖ్‌లో వాస్త‌వాధీన రేఖ వెంట ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యంలో భార‌త ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

చెనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపట్టిన∙నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా సామాజిక మాధ్యమమైన వీబోని వీడాలని (PM Modi Quits Weibo) నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైంది. చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. అయితే చైనా ట్విట్టర్‌గా పిలిచే వీబోలో ఉండే వీఐపీలు అకౌంట్‌ మూసివేయడానికి జరిగే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది.

అకౌంట్‌ డీయాక్ట్‌వేట్‌ చేయడానికి వీబో నుంచి అనుమతుల ప్రక్రియ ఆలస్యం కావచ్చు. కొన్నేళ్ల క్రితం చైనా వీబోలో (WEIBO) చేరిన మోదీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు ప్రధాని 115 పోస్టులను అందులో ఉంచారు.