India-China Face-Off: మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన
Indian Army and Chinese Patrolling Party | File Image | (Pho .. Read more at: https://www.latestly.com/india/news/india-china-face-off-no-indian-soldier-critical-18-in-leh-hospital-58-in-other-hospitals-says-report-1831984.html

New Delhi, June 18: సరిహద్దులో లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో (India-China Face-Off) 76 మంది భారతీయ జవాన్లు గాయపడ్డారని ఆర్మీ (Indian Army) అధికారులు ప్రకటించారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని (No Indian Soldier Critical), త్వరలోనే విధుల్లో చేరుతారని అధికారులు వెల్లడించారు.  సరిహద్దుల్లో నెత్తుటి ధారలపై స్పందించిన అమెరికా, అక్కడ అసలేం జరుగుతోంది, 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?

గాయపడినవారిలో 18 మంది లేహ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారు మరో 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని తెలిపారు. మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. చైనాకు రైల్వే డీఎఫ్‌సీసీఐఎల్‌ భారీ షాక్, రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు వెల్లడి, చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం

సోమవారం పొద్దుపోయిన తర్వాత గల్వాన్‌ లోయలోని పెట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద చైనా సైనికులు భారత బలగాలపై రాళ్లు, ఇనుప రాడ్లు, కట్టెలతో విక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందులో 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు సుమారు 45 మంది చనిపోయి ఉండవచ్చని భారత ఆర్మీ ప్రకటించింది. అయితే మృతుల సంఖ్యను చైనా అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న ఇండియా, 4జీ అప్‌గ్రేడ్‌‌లో చైనా పరికరాల వినియోగం బంద్, బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికం సంస్థలకు త్వరలో డాట్ ఆదేశాలు

కాగా గల్వాన్‌ లోయపై మొదటి నుంచీ సార్వభౌమాధికారం తమదేనని చైనా సైన్యం ప్రకటించడాన్ని భారత్‌ తోసిపుచ్చింది. ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని జూన్‌ 6నే లెఫ్ట్‌నెంట్‌ జనరళ్ల స్థాయి సమావేశంలో ఇరు దేశాల సైన్యాలు నిర్ణయించుకున్నాయని విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గుర్తుచేశారు. ఇప్పటికైనా చైనా తన కార్యకలాపాలను వాస్తవాధీన రేఖ లోపటికే పరిమితం చేసుకోవాలని సూచించారు. అమరవీరునికి అశ్రు నివాళి, సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తి, జనసంద్రమైన సూర్యాపేట, వీరుడా నీకు జోహర్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు

వరుసగా మూడో రోజు మేజర్‌ జనరల్‌ స్థాయి చర్చలు గురువారం జరిగాయి. మూడో రౌండు చర్చలు కాస్త పురోగతి సాధించాయి. శుక్రవారం నాలుగో రౌండు చర్చలు జరగనున్నాయి. ఈనెల 23న భారత్‌-రష్యా-చైనా విదేశాంగ మంత్రుల సమావేశం యథాతథంగా జరుగుతుంది.  శాంతిని కోరుకుంటున్నాం, సరైన సమయంలో ప్రతి దాడి తప్పదు, చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక, అమర వీరులకు నివాళి అర్పించిన ప్రధాని

భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలకు మధ్యవర్తిత్వం చేసే అధికారిక ప్రణాళికలేవీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రస్తుతం లేవని వైట్‌హౌస్‌ ప్రతినిధి కైలీ మెక్‌నానీ స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై ట్రంప్‌కు అవగాహన ఉందని చెప్పారు. ఈ విషయంపై ప్రధాని మోదీ, ట్రంప్‌ ఈ నెల 2న ఫోనులో మాట్లాడుకున్నారని మెక్‌నానీ నిర్ధారించారు. లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.