Colonel Santosh babu Final Journey (Photo-KTR Twitter)

Hyderabad, June 18: ఇండో‌, చైనా సరిహద్దు ఘర్షణలో (India-China Border Face-Off) దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు సంతోష్‌బాబుకు యావత్ ప్రజానీకం అశ్రునివాళి (Colonel Santosh babu Final Journey) అర్పించింది. కల్నల్‌ సంతోష్‌బాబు (Colonel Santosh Babu) అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. సూర్యాపేట (Suryapet) సమీపంలోని స్వగ్రామం కేసారంలో (Kesaram) సైనిక లాంఛనాలతో కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. శాంతిని కోరుకుంటున్నాం, సరైన సమయంలో ప్రతి దాడి తప్పదు, చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక, అమర వీరులకు నివాళి అర్పించిన ప్రధాని

సంతోష్ పార్థివదేహాన్ని ఆర్మీ అధికారులు చితివద్దకు తీసుకువచ్చారు. పార్థివదేహం చితి చుట్టూ కుటుంబసభ్యులు మూడు సార్లు తిరిగారు. ఆపై సంతోష్‌బాబు సతీమణి, కుమారుడు, బంధువులు, ప్రజలు సెల్యూట్‌ చేశారు. సంతోష్‌ కుమారుడు అనిరుధ్‌ చిన్న వయసు కావడంతో సంతోష్‌ తండ్రి ఉపేందర్ తోడు రాగా అనిరుధ్‌తో తలకొరివి పెట్టించారు.

కేసారం వ్యవసాయ క్షేత్రంలో సైనుకులు గౌరవార్థం గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. జనం బారులుగా తరలి వచ్చి వీరుడికి నివాళులర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు కల్నల్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి అంత్యక్రియలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Here's ANI Tweet

ఇండో‌, చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన తెలుగు ముద్దుబిడ్డ కల్నల్‌ సంతోష్‌బాబు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు జనం భారీగా జనం తరలి వచ్చారు. స్వీయ క్రమశిక్షణతో భౌతిక దూరం పాటిస్తూ దారిపొడవునా సంతోష్ భౌతికకాయంపై పూలు చల్లుతూ వీరుడా నీకు జోహర్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయా జెండాలు చేబూని మీ త్యాగం వృథా కాదు ముష్కర మూకలకు బుద్ధి చెబుతాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో అంత్యక్రియలకు 50 మందికి మాత్రమే అనుమతించారు. కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.కాగాసూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

Here's People raise Bharat Mata Ki Jai slogans

కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎంపీలు లింగయ్య యాదవ్‌, బండి సంజయ్‌, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు కిషోర్‌ కుమార్‌, సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Here's KTR Tweet

భారత్‌- చైనా సరిహద్దులో లఢక్‌ వద్ద ఘర్షణలో అసువులుబాసిన కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు భౌతికకాయం బుధవారం రాత్రి 7.30 గంటలకు భారత ఆర్మీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది. కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, మంత్రులు కే తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, నగర మేయర్‌ రామ్మోహన్‌, విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ నివాళులర్పించారు. సంతోష్‌బాబు మృతదేహం రాగానే ఆయన భార్య కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఆమెను గవర్నర్‌తోపాటు మంత్రులు ఓదార్చారు. కర్నల్‌ పార్థివదేహం అర్ధరాత్రి దాటాక సూర్యాపేటకు చేరుకున్నది. భౌతిక కాయం సూర్యాపేటకు చేరే వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి వెంటే ఉన్నారు. సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి

కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు త్యాగం మరువలేనిదని మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ రక్షణలో ప్రాణాలు విడిచిన సంతోష్‌బాబు ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. సంతోష్‌బాబు త్యాగనిరతిని దేశం ఎప్పటికీ మరచిపోలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. కర్నల్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు, పోలీస్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా సంతోష్‌ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

కర్నల్‌ సంతోష్‌బాబు భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులు బుధవారం ఢిల్లీనుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఆర్మీ అధికారులు వారిని పరామర్శించారు.