Come After You Get Raped: రేప్ జరగలేదు కదా..జరిగాక రా..చూద్దాం, కేసు నమోదు చేసుకోమంటే ఉత్తర ప్రదేశ్ పోలీసులు చెప్పిన సమాధానం, అలాంటిదేమి జరగలేదన్న ఐజీ భగత్
ఎక్కడ చూసినా ఈ అంశం మీద చర్చ జరుగుతోంది. తెలంగాణాలో దిషా రేప్ అండ్ మర్డర్ (Disha rape and murder case), ఉన్నావో బాధితురాలి సజీవ దహనం(Unnao rape victim) వంటి కేసులు మహిళల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు చాలా కేర్ తీసుకోవాల్సి ఉండగా ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
Lucknow, December 8: ఇప్పుడు దేశ వ్యాప్తంగా రేప్ అంశం పతాక స్థాయికి చేరింది. ఎక్కడ చూసినా ఈ అంశం మీద చర్చ జరుగుతోంది. తెలంగాణాలో దిషా రేప్ అండ్ మర్డర్ (Disha rape and murder case), ఉన్నావో బాధితురాలి సజీవ దహనం(Unnao rape victim) వంటి కేసులు మహిళల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు చాలా కేర్ తీసుకోవాల్సి ఉండగా ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ ఘటనతో దేశం మొత్తం ఆగ్రహంతో రగిలిపోతున్న నేపథ్యంలో అక్కడ మరో విస్మయకర ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉన్నావ్ జిల్లాలోని సింధూపూర్ గ్రామానికి (Sindhupur village) చెందిన ఓ యువతి(woman)తనపై ఐదుగురు యువకులు అత్యాచారయత్నం చేశారంటూ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే అత్యాచారం ఇంకా జరగలేదు కదా! జరిగాక వచ్చి ఫిర్యాదు చేయు(Rape toh hua nahi, jab hoga tab aana). అప్పుడు చూద్దామని పోలీసులు బదులిచ్చారు. ఈ సంఘటనపై అక్కడి ప్రజలు పోలీసుల మీద మండిపడుతున్నారు.
బాధితురాలి చెప్పిన కథనం ప్రకారం.. ‘నేను స్వగ్రామంలో మందులు తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో తనను ఐదుగురు యువకులు అడ్డగించి బలాత్కారం చేయబోయారు. వారిలో ముగ్గురిని గుర్తుపట్టగలను. వారి పేర్లు కూడా నాకు తెలుసు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి మొదట నేను 1090(Dial 10900కి కాల్ చేశాను. వాళ్లు 100(Dial 100)కు ఫోన్ చేయమన్నారు.
100కు ఫోన్ చేస్తే వారు ఉన్నావ్ స్టేషన్‌కి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్తే సంఘటన జరిగిన ప్రదేశం స్థానిక బీహార్ పోలీస్ స్టేషన్ పిరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లమన్నారు. మూడు నెలల నుంచి నన్ను ఇలాగే తిప్పించుకుంటున్నారు. నేను ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి ఆ యువకులు రోజూ మా ఇంటికి వచ్చి కేసు ఫైల్ అయితే చంపేస్తామని బెదిరిస్తున్నారు.
అయినా ఏదైనా ఘోరం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలి గానీ, జరిగాక హడావిడి చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని ఆమె ఓ జాతీయ మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ విషయంపై అక్కడి ఐజీని మీడియా వివరణ కోరగా ఆయన అలాంటిదేమీ లేదని పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.