Congress Candidate Dies of Heart Attack: 14 ఓట్ల తేడాతో ఓటమి, బాధతట్టుకోలేక గుండెపోటుతో కాంగ్రెస్ నేత మృతి, మధ్యప్రదేశ్‌లో విషాదం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధి చేతిలో ఓటమి
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రెవాలో (Rewa) జరిగింది. హనుమాన మండల కాంగ్రెస్(Congress) అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా , మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో పార్టీ టికెట్‌పై పోటీ చేశాడు. ఆదివారం ఫలితాలు వెలువడగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై విజయం సాధించాడు.
Rewa, July 18: జస్ట్ 14 ఓట్లతో ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రస్ నేత....తన ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రెవాలో (Rewa) జరిగింది. హనుమాన మండల కాంగ్రెస్(Congress) అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా (Hari narayan gupta), మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో పార్టీ టికెట్‌పై పోటీ చేశాడు. ఆదివారం ఫలితాలు వెలువడగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా (Akhilesh gupta) 14 ఓట్ల తేడాతో ఆయనపై విజయం సాధించాడు. దీంతో తన ఓటమి వార్తను విన్న హరినారాయణ్ గుప్తా వెంటనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్‌లు, 298 నగర్ పరిషత్‌లకు స్థానిక సంస్థల ఎన్నికలు (local body elections) జరిగాయి. జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల ప్రకారం బుర్హాన్‌పూర్, సత్నా, ఖాండ్వా, సాగర్‌లలో బీజేపీ విజయం సాధించింది. అయితే సింగ్రౌలీలో సత్తా చాటి గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో తన ఖాతా తెరిచింది.
ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇండిపెండెంట్ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాలు తెలుస్తున్నప్పటి నుంచి హరినారాయణ అసౌకర్యానికి గురయ్యారు. ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితం ప్రకటించే సరికి ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఉదయం 11-30 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించినట్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి నవీన్ దూబే తెలిపారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.