Rajasthan Shocker: కామాంధుడైన ఎమ్మెల్యే కొడుకు, స్నేహితులతో కలిసి పదో తరగతి విద్యార్థిపై దారుణంగా అత్యాచారం, నగ్న ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన నిందితులు

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన (Rajasthan Shocker) చేసుకుంది. ఎమ్మెల్యే కొడుకు(Congress MLA's Son) తన స్నేహితులతో కలిసి పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనే ఉద్దేశ్యంతో నగ్న ఫొటోలను సైతం తీశారు.

SHO Nathulal Meena (Photo/ANI)

Dausa, March 26: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన (Rajasthan Shocker) చేసుకుంది. ఎమ్మెల్యే కొడుకు(Congress MLA's Son) తన స్నేహితులతో కలిసి పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనే ఉద్దేశ్యంతో నగ్న ఫొటోలను సైతం తీశారు. ఈ ఘటన ఇప్పుడు రాజస్థాన్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అల్వార్ రాజ్‌గఢ్ ఎమ్మెల్యే జోహరీ లాల్ మీనా కుమారుడు (MLA Johari Lal Meena Son) దీపక్ మీనా తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. .

దీపక్‌ సహా మరో ఇద్దరు వ్యక్తులు దౌసా జిల్లాలోని రైనీ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెను.. మహువా-మందావర్ రోడ్‌లోని సామ్లేటి ప్యాలెస్ హోటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు అంతటితో ఆగకుండా పైశాచికత్వంతో బాధితురాలి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేశారని ఎస్‌హెచ్‌ఓ నాథూలాల్ మీనా (SHO Nathulal Meena) తెలిపారు.

రెచ్చిపోయిన కామాంధులు, మూడేళ్ల కుమారుడి ముందే తల్లిపై సామూహిక అత్యాచారం, బాలుడి తలపై గన్ పెట్టి బెదిరించి రేప్ చేసిన మృగాళ్లు

ఈ ఘటన ఫిబ్రవరి 24న చోటుచేసుకోగా తాజాగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. అయితే, అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే.. వీడియోను వైరల్ చేస్తానని నిందితులు బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులపై పోక్సో చట్లం కింద కేసు నమోదు (Three Booked for Gang-rape in Rajasthan's Dausa) చేసినట్టు తెలిపారు. ఈ దాడి ఘటనపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడి చేష్టల వల్ల రాష్ట్రం మరోసారి సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మరింత అవమానకరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement