MP Shocker: రెచ్చిపోయిన కామాంధులు, మూడేళ్ల కుమారుడి ముందే తల్లిపై సామూహిక అత్యాచారం, బాలుడి తలపై గన్ పెట్టి బెదిరించి రేప్ చేసిన మృగాళ్లు
Image used for representational purpose only | (Photo Credits: ANI)

Bhopal, Mar 26: దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు కామాంధుల కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన (MP Shocker) చోటు చేసుకుంది. మానవత్వం మరచి ఆమె మూడేళ్ల కుమారుడి ఎదుటే ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి (Two rape woman) పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ(24)పై లైంగిక దాడి చేశారు.

బాధితురాలు తన మూడేళ్ల కొడుకుతో కలిసి వెళ్తుండగా దుండగులు ఆ బాలుడికి గన్‌తో చంపేస్తామని బెదిరించి ( threatening to kill her minor son) తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకోగా.. బాధితురాలు శనివారం మోహగావ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను విక్రమ్‌, కృష్ణ శర్మగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

మొదటి భార్యను తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుందని చంపేశాడు. రెండో భార్యకు తమ్ముడితో లింక్ ఉందనే తెలిసి...భర్త దారుణంగా ఏం చేశాడంటే...

దీంతో వారి కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నట్టు పోలీసు సూపరింటెండెంట్ శైలేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ సంఘటన గురువారం రాత్రి భింద్ జిల్లా హెడ్‌క్వార్టర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో జరిగిందని పోలీసులు తెలిపారు.