Ananthapur Shocker: మొదటి భార్యను తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుందని చంపేశాడు. రెండో భార్యకు తమ్ముడితో లింక్ ఉందనే తెలిసి...భర్త దారుణంగా ఏం చేశాడంటే...
Crime | Representational Image (Photo Credits: Pixabay)

అనంతపురం, మార్చి 25: మొదటి భార్య.. మరిదితో ఎఫైర్ పెట్టుకుందని ఆమెను చంపేశాడు. కొన్నాళ్లకు రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ తన సొంత తమ్ముడితో భార్య ఎఫైర్ పెట్టుకుందని అనుమానించాడు. ఈసారి భార్యను కాదు ఏకంగా తోడబుట్టిన తమ్ముడ్ని హతమార్చాడు. దాదాపు నెల రోజులపాటు మిస్టరీగా ఉన్న ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివగాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా మడకశిర మండలం ఎర్రబొమ్మనపల్లికి చెందిన రంగనాథ్ కు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఐతే భార్యతో తమ్ముడి అనంత రాజుకు వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి వ్యవహారం తెలిసిన రంగనాథ్, మొదటి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఏడేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఐతే రెండో భార్యతోనూ అనంతరాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రంగనాథ్ అనుమానించాడు.

RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ

ఈ క్రమంలో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. తమ్ముడితోనే వివాదాలుండేవి. ఐతే తమ్ముడు తన భార్యను వదలడం లేదని భావించిన రంగనాథ్.. అతడ్ని హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో గార్లదిన్నె మండలం కల్లూరులో ఉంటున్న అనంతర రాజు వద్దకు వెళ్లాడు. రాత్రి పూట నిద్రిస్తుండగా అతడి గొంతుపై రాడ్డుతో కొట్టి అనంతరం బెల్టులో గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని తీసుకెళ్లి రామదాసు పేట సమీపంలోని రైల్వే ట్రాక్ పై పడేసి సూసైడ్ గా చిత్రీకరించేందుకు యత్నించాడు.

అయితే అనంతరాజును మృతిపై అతడి భార్య సుజాత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు విషంయం బయటపడింది. దీంతో రంగనాథ్ ను అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి వద్ద అరెస్ట్ చేశారు.