Coromandel Express Derailment Video:గూడ్స్‌ను ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్, 50 మంది మృతి, 180 మందికి పైగా గాయాలు
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న దుర్ఘటనలో ఏడు బోగీలు పట్టాలు తప్పి, బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో 50 మంది ప్రయాణికులు మరణించగా, మరో 350 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Balasore/Howrah, June 2: ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express Derails) రైలు ఘోర ప్రమాదానికి గురైంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న దుర్ఘటనలో ఏడు బోగీలు పట్టాలు తప్పి, బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో 50 మంది ప్రయాణికులు మరణించగా, మరో 350 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.(Coromandel Express collides) పలువురు ప్రయాణికులు బోగీల కింద ఉన్నారని వారిని బయటకు తీస్తున్నామని ఎమర్జెన్సీ అధికారులు చెప్పారు. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఘటనాస్థలికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైంది. రైల్వే అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బోగీల్లో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు వెలికి తీస్తున్నారు.
క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గూడ్స్ రైలును ఢీకొనడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని (Coromandel Express Derails) ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అధికారులను అప్రమత్తం చేశారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో రైల్వే పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించారు. 044-2535 4771, 67822 62286, బెంగాల్ హెల్ప్ లైన్ నంబర్లు – 033 – 2214 3526, 2253 5185.