India Coronavirus: దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా 4,40,215కి చేరిన కేసులు సంఖ్య, ప్రపంచ వ్యాప్తంగా 91 లక్షలు దాటిన కేసులు

గడిచిన 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు (coronavirus cases) నమోదు కాగా.. వైరస్‌ బారినపడి 312 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,215కి చేరింది. మరణాల సంఖ్య 14 వేలు దాటింది.

Coronavirus in India | (Photo Credits: PTI)

New Delhi, June 23: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల (India Coronavirus) సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు (coronavirus cases) నమోదు కాగా.. వైరస్‌ బారినపడి 312 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,215కి చేరింది. మరణాల సంఖ్య 14 వేలు దాటింది. నేటి నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర, ప్రజలు లేకుండా జగన్నాథుడి ఊరేగింపు, యాత్ర సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతన్న సుప్రీంకోర్టు

ఇప్పటివరకు 2,48,190 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,78,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.వరుసగా 12వ రోజూ దేశంలో 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

రాజ‌ధాని ఢిల్లీలో గత 24 గంటల్లో న‌మోద‌యిన‌ కరోనా పాజిటివ్ కేసుల క‌న్నా, వ్యాధి నుంచి కోలుకున్న‌వారే అధికంగా ఉండ‌టం ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. గ‌త‌ 24 గంటల్లో ఢిల్లీలో 2909 మంది కరోనా పాజిటివ్‌గా తేల‌గా, అదే స‌మయంలో 3,589 మంది కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. 58 మంది కరోనాతో మృతి చెందారు. రాజధానిలో మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 62,655కు చేరుకుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అలాగే కరోనా కార‌ణంగా ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 2,233 మంది మృతిచెంద‌గా, 36,602 మంది వ్యాధి‌ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం 23,820 కరోనా యాక్టివ్ కేసుల ఉన్నాయి. వీరిలో 12,922 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91 లక్షల మార్క్‌ దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 91,92,712 మందికి వైరస్‌ సోకింది. కరోనా బారినపడి 4,74,445 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా(23,88,153 కేసులు), బ్రెజిల్‌(11,11,348), రష్యా(5,92,280), భారత్‌(4,40,685) దేశాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికా(1,22,610)లోనే ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయి. అమెరికా తర్వాత బ్రెజిల్‌(51,407), బ్రిటన్‌(42,647), ఇటలీ(42,647), ఫ్రాన్స్‌(29,663), స్పెయిన్‌(28,324), మెక్సికో(22,584), భారత్‌(14,011) దేశాల్లో కరోనా వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif