COVID-19 Cases in India: ఇండియాలో 15 లక్షలు దాటిన కరోనావైరస్ కేసులు, భయపెడుతున్న మురికివాడలు, పెరుగుతున్న రికవరీ రేటు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 49,292 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించగా, ఏకంగా 768 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం కరోనా మరణాల సంఖ్య 34,193కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నేటి ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,513 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (COVID-19 Cases in India) 15,31,670కి చేరాయి. ఇందులో 5,09,447 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9,88,029 మంది కోలుకున్నారు.
New Delhi, July 29: భారత్‌లో కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 49,292 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించగా, ఏకంగా 768 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం కరోనా మరణాల సంఖ్య 34,193కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నేటి ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,513 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (COVID-19 Cases in India) 15,31,670కి చేరాయి. ఇందులో 5,09,447 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9,88,029 మంది కోలుకున్నారు.
కరోనా కేసులలో భారత్ మూడో స్థానంలో ఉండగా.. 44.3 కరోనా కేసులతో అమెరికా, 24.4 పాజిటివ్ కేసులతో బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,77,43,740 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 4,08,855 శాంపిల్స్ మంగళవారం టెస్ట్ చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. ఐసోలేషన్ వార్డులో లైంగిక దాడి, కరోనా సోకిన మహిళపై మరో కరోనా సోకిన డాక్టర్ అసభ్య ప్రవర్తన, నోయిడాలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు
ఇండియాలో మహమ్మారి ఇంకా వ్యాపిస్తోందని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది. కరోనా ప్రపంచాన్ని పట్టిన తరువాత... ఇంకా చెప్పాలంటే, తొలి కేసు ఇండియాలో వచ్చిన తరువాత నాలుగు నెలలకు లక్ష కేసులు రాగా, ఆపై రెండు నెలల వ్యవధిలోనే కేసుల సంఖ్య 15 లక్షలకు చేరడం గమనార్హం. ఇదే కొనసాగితే ప్రపంచపు కరోనా కేసుల్లో ఇండియా రెండో స్థానానికి చేరుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఆగస్టు 30 వరకు వారంలో రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి
ఇక దేశంలో కరోనా వైరస్ బారినపడి, చికిత్సతో కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసులు 14,83,156 కాగా, 9,52,743 మంది పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. అంటే 64.24 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. రికవరీ రేటు 40 రోజుల క్రితం 53 శాతంగా ఉండేది. కరోనా మరణాల రేటు కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. జూన్ 18న 3.33 శాతం కాగా, ప్రస్తుతం 2.25 శాతంగా నమోదైంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ప్రతి ఆరుగురిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారని, ఇక మురికివాడల్లో నివాసం ఉంటున్న లక్షలాది మందిలో 57 శాతం మందికి ఇప్పటికే వైరస్ సోకిందని సీరోలాజికల్ సర్వైలెన్స్ అధ్యయనం పేర్కొంది. నగరంలో నివాసం ఉంటున్న 7 వేల మంది నమూనాలను సేకరించిన అధ్యయన బృందం, వారి రక్తంలోని యాంటీ బాడీలపై పరీక్షలు జరిపి ఈ వాస్తవాన్ని వెలువరించింది. ముంబైలో కరోనా కేసులు లక్ష మార్క్ ను దాటిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది దాదాపు 7 శాతానికి సమానం. ఇప్పటివరకూ 6 వేల మందికి పైగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నగరంలో సుమారు1.20 కోట్ల మంది నివాసం ఉంటుండగా, వీరిలో 65 శాతం మంది మురికి వాడల్లోనే ఉంటున్నారు.
ఈ అధ్యయనానికి నీతి ఆయోగ్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ తమవంతు సహకారాన్ని అందించాయి. మూడు మునిసిపల్ వార్డుల్లో పర్యటించిన ఆరోగ్య కార్యకర్తలు శాంపిల్స్ సేకరించారు. కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు పురుషులతో పోలిస్తే మహిళలలో ఎక్కువగా ఉన్నాయని కూడా అధ్యయనం వెల్లడించింది. ఇదే విధమైన అధ్యయనాన్ని ఇటీవల ఢిల్లీలోనూ నిర్వహించగా, 23.48 శాతం మంది వైరస్ బారిన పడ్డట్టు తేలింది. ఇదిలావుండగా, ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గడచిన రెండు నెలల కాలంలోనే తొలిసారిగా అతి తక్కువ కేసులు మంగళవారం నాడు నమోదయ్యాయి. నిన్న కేవలం 717 కేసులు మాత్రమే వచ్చాయని, మరో 55 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.