Kolkata, July 28: పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ (2020 Coronavirus Pandemic in India) వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వారంలో రెండ్రోజుల పాటు ఆగస్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ను (Lockdown in West Bengal) పొడిగిస్తున్నాం..’’ అని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ రెండు రొజుల్లో ముగియనుండటంతో వారంలో రెండురోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ను (Lockdown of '2 Days Per Week) పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. డాక్టర్‌పై ఉమ్మేసిన కరోనా పేషెంట్లు, త్రిపురలో అమానుష ఘటన, దేశంలో 24 గంటల్లో 47,704 కోవిడ్-19 కేసులు నమోదు, 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు
అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, ప్రజా రవాణా, ప్రయివేటు రవాణా వాహనాలు ఈ నెల 29 వరకు మూసే ఉంటాయి. అదే రోజు మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం వెలువడనుంది. కాగా లాక్‌డౌన్ సందర్భంగా కేవలం అత్యవసర సేవల వాహనాలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు.
Update by ANI
Complete lockdown will be observed in the state on 2nd, 5th, 8th, 9th, 16th, 17th, 23rd, 24th and 31st August: West Bengal CM Mamata Banerjee https://t.co/wb1jJxSaFq
— ANI (@ANI) July 28, 2020
రాష్ట్రంలోని కోర్టులు, వ్యవసాయ పనులు, తేయాకు పనులు, పెట్రోల్ బంకులు, ఆహార పదార్థాల రవాణా తదితర సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయించారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోల్‌కతాలోని నేతాజీ సుబోస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశారు.