India COVID-19: గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు నమోదు, దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 5815కు చేరిన మరణాల సంఖ్య

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,07,615కు ఎగబాకింది. కరోనా (Coronavirus) మహమ్మారి బారి నుంచి 1,00,303 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు దాదాపు 50 శాతానికి చేరడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

COVID-19 Outbreak in India | File Photo

New Delhi, June 3: భారత్‌లో కరోనా (Coronavirus Cases in India) మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,07,615కు ఎగబాకింది. కరోనా (Coronavirus) మహమ్మారి బారి నుంచి 1,00,303 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు దాదాపు 50 శాతానికి చేరడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా యాప్‌ను ప్రారంభించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో 10 మందికి కరోనా వైరస్

ఇక 1,01,487 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5815కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు భారత్‌లో కోవిడ్‌-19 మరణాలను తక్కువగా చూపుతున్నారనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కోవిడ్-19తో పాటు ఇతర వ్యాధులతో మరణించిన వారి గణాంకాలను విశ్లేషించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని, మృతుల సంఖ్యను తక్కువ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 72,300 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,465 మంది మృతి చెందారు. తమిళనాడులో 24,586, ఢిల్లీలో 22,132, గుజరాత్‌లో 17,632, రాజస్థాన్‌లో 9,373, యూపీలో 8,729, మధ్యప్రదేశ్‌లో 8,420, పశ్చిమ బెంగాల్‌లో 6,168, బీహార్‌లో 4,096, కర్ణాటకలో 3,796, ఏపీలో 3,791, తెలంగాణలో 2,891, జమ్మూకశ్మీర్‌లో 2,718, హర్యానాలో 2,652, పంజాబ్‌లో 2,342, ఒడిశాలో 2,245, అసోంలో 1,562, కేరళలో 1,413, ఉత్తరాఖండ్‌లో 1,043, జార్ఖండ్‌లో 722, ఛత్తీస్‌గఢ్‌లో 564, త్రిపురలో 471, హిమాచల్‌ప్రదేశ్‌లో 345, ఛండీఘర్‌లో 301, మణిపూర్‌లో 89, లఢక్‌లో 81, గోవాలో 79, నాగాలాండ్‌లో 58, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 33, మేఘలాయలో 30, అరుణాచల్‌ప్రదేశ్‌లో 28, మిజోరాంలో 13, సిక్కింలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైంది.