Section 144 in Delhi: దేశ రాజధానిలో 144 సెక్షన్‌, మార్చి 31 అర్ధరాత్రి 12 గంటల వరకు అమలులో, 7కు చేరిన కరోనా మృతులు, 396 మందికి కోవిడ్-19 పాజిటివ్

ఒకే ప్రాంతంలో నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించింది. దేశంలో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు బయటకు రావద్దనీ, సమూహాలుగా ఏర్పడకూదని ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: IANS)

New Delhi, March 23: కరోనా పంజా (Coronavirus Outbreak) విసిరిన నేపథ్యంలొ దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్‌ (Section 144 in Delhi) విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) ప్రకటన విడుదల చేసింది. ఒకే ప్రాంతంలో నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించింది.

తెలంగాణలో కరోనా కలవరం, 22కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు బయటకు రావద్దనీ, సమూహాలుగా ఏర్పడకూదని ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

తమకు తాము స్వీయ నిర్బంధం పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజలు స్వతహాగా ‘జనతా కర్ఫ్యూ’ను పాటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సెక్షన్‌ 144 ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మార్చి 31 అర్ధరాత్రి 12 గంటల వరకు అమలులో ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌ (Delhi CM Arvind Kejriwal) తెలిపారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్‌ సేవలు మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు మెట్రోరైల్‌ సంస్థ తెలిపింది. కాగా, దేశంలో ఇప్పటికే 396 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వారిని ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. కరోనా కారణంగా దేశంలో మృతుల సంఖ్య 7కు చేరింది. ఆదివారం సూరత్‌లో ఒక వ్యక్తి మరణించారు. నిన్నటి వరకు నలుగురు వ్యక్తులు మాత్రమే కరోనా కారణంగా మరణించగా, ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మరణించారు.

దేశ వ్యాప్తంగా రైళ్లు బంద్

144 సెక్షన్‌ విధించడంపై ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే 144 సెక్షన్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.