Covaxin COVID-19 Vaccine: డెల్టా,బీటా వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కుంటున్న కొవాగ్జిన్‌, కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలను ప్రకటించిన భారత్‌ బయోటెక్, తీవ్ర లక్షణాలు నిలువరిస్తున్న వ్యాక్సిన్

ట్రయల్స్‌లో టీకా (Covaxin COVID-19 Vaccine) తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ తెలిపింది.

Covaxin (Photo Credits: Bharat Biotech)

New Delhi, July 3: భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలను భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) శనివారం ప్రకటించింది. ట్రయల్స్‌లో టీకా (Covaxin COVID-19 Vaccine) తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్‌లో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్‌లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ ప్రకటించింది.

కొవాగ్జిన్​ తీవ్ర లక్షణాలు నిలువరించి హాస్పిటలైజేషన్‌ తగ్గిస్తోందని పేర్కొంది. కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ మెడ్‌జివ్ (medRxiv)లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ట్రయల్‌లో కొవాగ్జిన్‌ టీకా సురక్షితమైందని రుజువైందని కంపెనీ పేర్కొంది. నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే.. జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. ట్రయల్స్‌లో 146 రోజుల పాటు.. వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు.

Here' Update

ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లయిందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం టీకా డ్రైవ్‌లో భాగంగా అత్యవసర వినియోగం కింద టీకాను వినియోగిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ