COVID-19 in India: దేశంలో 29 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలోనే 8 వేలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 3 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 6,868 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 934కి చేరింది. గడిచిన 28 రోజుల నుంచి 16 జిల్లాల్లో ఒక్క కరోనా (Coronavirus) కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 14 రోజుల్లో 85 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో 21,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, April 28: దేశంలో గడిచిన 24 గంటల్లో 62 మంది కరోనాతో (Coronavirus in India) చనిపోగా, కొత్తగా 1,543 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 6,868 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 934కి చేరింది. గడిచిన 28 రోజుల నుంచి 16 జిల్లాల్లో ఒక్క కరోనా (Coronavirus) కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 14 రోజుల్లో 85 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో 21,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో కేవలం 2 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు, రాష్ట్రంలో 1003కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, జిల్లాల వారీగా ప్రస్తుతం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా మరో 52 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అలాగే 81 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,937కి పెర గగా, కోలుకున్నవారి సంఖ్య 1,101కి చేరుకుంది. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. అయితే 52 కొత్త కేసుల్లో 47 చెన్నై లోనే నమోదు కాగా, అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 570కి పెరగడం ఆందోళనకరమైన అంశంగా మారింది. విద్యార్థులకు కొత్తగా డీఐవై టోపీలు, చైనాలో తిరిగి ప్రారంభమైన స్కూళ్లు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విద్యార్థుల ఫోటోలు

మహారాష్ట్రలో కరోనా సోకిన వారి సంఖ్య 8 వేలు దాటింది. కేవలం ముంబైలోనే 5500 కు పైగా కేసులు ఉన్నాయి. కరోనా సోకిన వారి సంఖ్య 5500 దాటిన మొట్టమొదటి నగరంగా ముంబై నిలిచింది. పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ల దృష్ట్యా మునిసిపల్ పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. నగరంలోని 1,200 మునిసిపల్ పాఠశాలల్లో కొన్నింటిని క్వారంటైన్ కేంద్రాల కోసం ఉపయోగిస్తామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) అధికారులు తెలిపారు. ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదు, 1177 కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 31 మంది మృతి, కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా క్వారంటైన్‌కే..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య 3 వేలకు పైగా ఉంది. గత 24 గంటల్లో 190 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా బాధితుల సంఖ్య 3108 కి చేరుకుంది. అయితే గత రెండు రోజుల్లో ఒక్క రోగి కూడా కరోనాతో మరణించలేదు. అలాగే గత 24 గంటల్లో ఒక్క రోగి అయినా కోలుకున్నట్లు ఎటువంటి రిపోర్ట్ కూడా లేదు. కాగా ఢిల్లీలో హాట్‌స్పాట్-కంటైన్మెంట్ జోన్‌ల సంఖ్య 97 కి పెరిగింది. ఈ ప్రాంతాల్లోని ప్రజల రాకపోకలు నిషేధించారు. అన్ని దుకాణాలు మూసివేశారు.