COVID-19: కరోనాలో డ్యూటీ చేస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందే, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

కరోనాలో విధులు నిర్వహిస్తూ 2020లో కోవిడ్-19 బారిన పడి మరణించిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా పరిహారం నాలుగు వారాల్లోగా విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం Delhi నగర పాలక సంస్థను ఆదేశించింది.

Delhi High Court (Photo Credits: IANS)

New Delhi, Nov 20: కరోనాలో విధులు నిర్వహిస్తూ 2020లో కోవిడ్-19 బారిన పడి మరణించిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా పరిహారం నాలుగు వారాల్లోగా విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం Delhi నగర పాలక సంస్థను ఆదేశించింది. నవంబర్ 3న ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం మరణించిన కానిస్టేబుల్ అమిత్ కుమార్ భార్య, తండ్రికి పరిహారం మంజూరు చేసినట్లు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ గమనించారు.ఈ సందర్భంగా ఆర్డర్ పరంగా మొత్తం నాలుగు వారాల్లో విడుదల చేయాలి" అని కోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలో, మే 13, 2020 నాటి క్యాబినెట్ నిర్ణయం ప్రకారం మృతుడి భార్య, తండ్రికి వరుసగా రూ. 60 లక్షలు, రూ. 40 లక్షలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇంతరవకు ఆ డబ్బులు విడుదల చేయకపోవడంతో మృతుడి భార్య, తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది.

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం, బాధితుకులకు బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, ప్రమాదానికి కారణాలు ఏంటంటే..

ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అరుణ్ పన్వార్ మాట్లాడుతూ అధికారులు ఆదేశాలను పాటిస్తారని అన్నారు. తన భర్త..కరోనాలో డ్యూటీ చేస్తూ మరణించాడని కుమార్ భార్య వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది. కోవిడ్-19 లాక్‌డౌన్ చర్యలకు కట్టుబడి ఉండేలా దీప్ చంద్ బంధు హాస్పిటల్‌లో యువ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కుమార్‌ని నియమించారు. అయితే విధుల్లో కోవిడ్ సోకి అతను మరణించాడు.

డిసెంబర్ 2022లో, కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని అధికారులను హైకోర్టు కోరింది. ఎక్స్‌గ్రేషియా చెల్లింపు కోసం చేసిన స్పష్టమైన ప్రకటన నుండి నగర ప్రభుత్వం వెనక్కి తగ్గకూడదని పేర్కొంది. మృతుడి భార్య వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, గతంలో అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం ఉందని, అలాగే ప్రెస్ క్లిప్పింగ్‌లు రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలో సందేహం లేదని పేర్కొంది.

మహమ్మారి సమయంలో ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పోలీసు సిబ్బందిని నగరం అంతటా COVID-19 డ్యూటీకి నియమించాలని, అందువల్ల మరణించిన వ్యక్తి COVID-19 డ్యూటీలో లేడని ప్రతివాదులు వాదించలేరని పిటిషనర్ చెప్పారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన తన భర్త మరణించిన తర్వాత 2020 మే 7న చేసిన ట్వీట్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చిన నష్టపరిహారాన్ని పొందేందుకు తాను ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు పిటిషన్‌లో భార్య సమర్పించింది.

కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ను అభ్యర్ధన ప్రస్తావిస్తూ, “అమిత్జీ (కానిస్టేబుల్) తన జీవితాన్ని పట్టించుకోలేదు, ఢిల్లీ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. అతనికి కరోనా సోకి ప్రాణాలు విడిచాడు. ఢిల్లీవాసులందరి తరపున ఆయనకు నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుందంటూ కోర్టుకు ఢిల్లీ సీఎం ట్వీట్ ను మరోసారి బాధితురాలు గుర్తు చేసింది. కోవిడ్-19కి బలైన పోలీస్ ఫోర్స్ నుండి మొదటి వ్యక్తి తన భర్త అని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ మహిళ తెలిపింది.