COVID-19 Recovery Rate: 80 జిల్లాల్లో నో కేసులు, ఇండియాలో కరోనా రికవరీ శాతం 20.57, మొత్తం 23 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 1752 కేసులు నమోదు

భారత్‌లో కరోనా బాధితుల రికవరీ (Coroanvirus Recovery Rate) 20.57శాతంగా ఉందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ (Lav Agarwal) శుక్రవారం సాయంత్రం వెల్లడించారు.ఇతర దేశాలతో పోల్చితే రికవరీ విషయంలో భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు.

Joint Secretary at Ministry of Health and Family Welfare Lav Agarwal (Photo Credits: IANS)

New Delhi, April 24: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 23 వేలు దాటాయి. భారత్‌లో కరోనా (2020 Coronavirus Pandemic in India) పాజిటివ్‌ కేసుల సంఖ్య 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,752 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,452కు పెరిగిందని వెల్లడించింది. చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

భారత్‌లో కరోనా బాధితుల రికవరీ (Coroanvirus Recovery Rate) 20.57శాతంగా ఉందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ (Lav Agarwal) శుక్రవారం సాయంత్రం వెల్లడించారు.ఇతర దేశాలతో పోల్చితే రికవరీ విషయంలో భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు.

గడిచిన 14 రోజుల్లో 80 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 723 మంది మృతి చెందారని, 24 గంటల్లో 491 మంది కోలుకున్నారని, 4,713 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 17,915 యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేశామని లవ్‌ అగర్వాల్‌ వివరించారు.  కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, సానుకూల ఫలితాలను ఇస్తోన్న ప్లాస్మా చికిత్స, మీడియాకు వెల్లడించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

కరోనా నియంత్రణకు హైదరాబాద్‌, సూరత్, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల్లో మరో 4 ఐఎంసీటీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం వరకు 5 లక్షలకు పైగా కరోనా టెస్టులు పూర్తి చేశామని' కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ వివరించారు.

'Around 9.45 Lakh on Surveillance System'

COVID-19 కి వ్యతిరేకంగా పోరాటంలో నిఘా ప్రాథమిక ఆయుధం. సుమారు 9.45 లక్షల మంది నిఘా వ్యవస్థలో ఉన్నారు ”అని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ సింగ్ తెలిపారు.

Name of State / UT Total Confirmed cases (Including 77 foreign Nationals) Cured/Discharged/Migrated Death
1 Andaman and Nicobar Islands 22 11 0
2 Andhra Pradesh 955 145 29
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 36 19 1
5 Bihar 176 46 2
6 Chandigarh 27 14 0
7 Chhattisgarh 36 28 0
8 Delhi 2376 808 50
9 Goa 7 7 0
10 Gujarat 2624 258 112
11 Haryana 272 156 3
12 Himachal Pradesh 40 18 1
13 Jammu and Kashmir 427 92 5
14 Jharkhand 55 8 3
15 Karnataka 463 150 18
16 Kerala 448 324 3
17 Ladakh 18 14 0
18 Madhya Pradesh 1852 203 83
19 Maharashtra 6430 840 283
20 Manipur 2 2 0
21 Meghalaya 12 0 1
22 Mizoram 1 0 0
23 Odisha 90 33 1
24 Puducherry 7 3 0
25 Punjab 277 65 16
26 Rajasthan 1964 230 27
27 Tamil Nadu 1683 752 20
28 Telengana 984 253 26
29 Tripura 2 1 0
30 Uttarakhand 47 24 0
31 Uttar Pradesh 1604 206 24
32 West Bengal 514 103 15
Total number of confirmed cases in India 23452* 4814 723

ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. కరోనా బారిన పడ్డ వారిలో రికవరీ రేటు మన దేశంలో బావుందని పేర్కొంది. అయితే, లాక్ డౌన్‌ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడమే దేశ ప్రజలందరి బాధ్యతని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

క‌రోనా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో భార‌త్ ముందుగానే స్పందించి లాక్‌డౌన్ విధించ‌డంతో మ‌నం చాలా సేఫ్ జోన్‌కు వ‌చ్చామ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే మూడో ద‌శ నుంచి భార‌త్ ర‌క్షించ‌బ‌డింద‌ని చెప్పింది. రాష్ట్రాలు లాక్ డౌన్ అమలులో మరింత కఠినంగా వుండాలని సూచించింది.