COVID-19 Vaccine Update: వ్యాక్సిన్‌పై తీపి కబురు, వచ్చే ఏడాది జూలై నాటికి 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందిస్తామని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

వచ్చే ఏడాది జులై నాటికి 130 కోట్ల దేశ జనాభాలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన (Harsh Vardhan) ఆదివారం వెల్లడించారు. ఈ దిశగా ప్రభుత్వం 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను (500 Million Doses For 25 Crore Citizens) సేకరిస్తుందని, వ్యాక్సిన్‌ను సమంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు.

Dr Harsh Vardhan | File Image | (Photo Credits: PTI)

New Delhi, October 4: దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కీలక వ్యాఖ్యలు (COVID-19 Vaccine Update) చేశారు. వచ్చే ఏడాది జులై నాటికి 130 కోట్ల దేశ జనాభాలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన (Harsh Vardhan) ఆదివారం వెల్లడించారు. ఈ దిశగా ప్రభుత్వం 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను (500 Million Doses For 25 Crore Citizens) సేకరిస్తుందని, కోవిడ్ వ్యాక్సిన్‌ను సమంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు.

అయితే ఎవరికీ వ్యాక్సిన్‌ అందచేయాలనే వివరాలతో కూడిన ప్రాధాన్యతా గ్రూప్‌లను పేర్కొంటూ ఈ నెలాఖరులోగా జాబితాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని ఆయన చెప్పారు. వ్యాక్సిన్‌ సేకరణను కేంద్రీకృతంగా చేపట్టి ప్రతి కన్‌సైన్‌మెంట్‌ను రియల్‌టైంలో ట్రాక్‌ చేస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి చెప్పారు. వ్యాక్సిన్‌ను ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు అందచేస్తామని ఆయన వెల్లడించారు.

గుడ్ న్యూస్, రూ.50కే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌‌ను అందిస్తామని తెలిపిన ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, దేశంలో తాజాగా 75,829 మందికి కరోనా, కోవిడ్ మరణాలపై బయటకొచ్చిన ఆసక్తికర విషయాలు

ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, పారిశుద్ధ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో పాటు వైరస్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ ప్రక్రియలో నిమగ్నమైన ఇతరులకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ను వేస్తామని చెప్పారు. వ్యాక్సిన్‌ సమంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని, భారత వ్యాక్సిన్‌ తయారీదారులకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భారత్‌లో పలు వ్యాక్సిన్‌లు కీలక దశ పరీక్షలకు చేరుకోవడంతో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.