COVID-19 Tally in India: గుడ్ న్యూస్, రూ.50కే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌‌ను అందిస్తామని తెలిపిన ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, దేశంలో తాజాగా 75,829 మందికి కరోనా, కోవిడ్ మరణాలపై బయటకొచ్చిన ఆసక్తికర విషయాలు
coronavirus in idnia (Photo-PTI)

New Delhi, October 4: దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 75,829 మంది క‌రోనాబారిన ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 65,49,374కు (COVID-19 Tally in India) చేరింది. ఇందులో 55,09,967 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, మ‌రో 9,37,625 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల 940 మంది మ‌ర‌ణించారు.

దీంతో మొత్తం 1,01,782 (Coronavirus deaths in india) మంది బాధితులు క‌రోనాతో చ‌నిపోయార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నిన్న ఒక్క‌రోజే 11,42,131 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నామండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు మొత్తం 7,89,92,534 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.

కరోనా టెస్టింగ్ చేయించుకునే వారికి ఢిల్లీ సిఖ్ గురుద్వారా శుభవార్తను అందించింది. దేశంలోనే అత్యంత తక్కువగా ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ ను కేవలం రూ. 50 కే అందించనున్నట్లు ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ చెప్పింది. గురుద్వారా ప్రాంగణంలోనే ఉన్న గురు హరిక్రిషన్‌ ఆస్పత్రిలో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ మొదటి వారంలో ఆయా సేవలు మొదలవుతాయని చెప్పింది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్‌ ను కేవలం రూ. 600కే అందిస్తామని కమిటీ అధ్యక్షుడు మన్జిందర్‌ సింగ్‌ చెప్పారు. పేదలకు ఎమ్‌ఆర్‌ఐ కేవలం రూ. 50కే అందిస్తామని తెలిపారు. ప్రైవేటు ల్యాబుల్లో ఎమ్‌ఆర్‌ఐ రూ. 2,500 వరకూ ఉంది.

దేశ వ్యాప్త నిరసనలతో దిగొచ్చిన యూపీ సర్కారు, సీబీఐకి హత్రాస్ దారుణ హత్య కేసు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని తెలిపిన కాంగ్రెస్ పార్టీ

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అమెరికా తరువాత భారత్‌లోనే కరోనా బాధితులు అత్యధికంగా ఉన్నారు. భారత్‌లోని 85 వేల మంది కరోనా బాధితులు, ఆరు లక్షల కాంటాక్ట్ ట్రేసింగ్ కేసులపై యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భారత్‌లోని వివిధ ఆసుపత్రులలో క్రిటికల్ కండీషన్‌లోవుంటూ చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఐదు రోజులలో మృతి చెందుతుండగా, అమెరికాలో ఇందుకు 14 రోజులు పడుతోందని సర్వే తెలిపింది.

బీహార్‌లో పూర్తయిన సీట్ల పంపకం, కూటమి నేతగా తేజస్వీ యాదవ్‌ ఏకగ్రీవ ఎన్నిక, బీహార్‌ అసెంబ్లీకి అక్టోబర్‌ 28, నవంబర్‌ 3,7 తేదీల్లో పోలింగ్‌

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు దేశాలలో చోటుచేసుకుంటున్న మరణాల మధ్య అంతరానికి వైద్య సదుపాయాలే ప్రధాన కారణమని తెలిపారు. కాగా 65 ఏళ్ల దాటిన కరోనా మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ అధ్యయనాన్ని సైన్స్ జర్నల్ ప్రచురించింది. బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన డాక్టర్ ఝా మాట్లాడుతూ భారత్‌లో ఆర్థిక కారణాలతో చాలామంది కరోనా వ్యాధి తీవ్రమైన తరువాతనే ఆసుపత్రులకు వస్తున్నారు. ఇదే భారత్‌లో కరోనా మృతులకు కారణంగా నిలుస్తోంది. డాక్టర్ లెబనాయీ మాట్లాడుతూ భారత్‌లో కరోనా మరణాల పెరుగుదలకు భాధితులలో అప్పటికే రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలు ఉండటం కూడా కారణమన్నారు.