RJD leader Tejashwi Yadav at the joint press conference | (Photo Credits: ANI)

Patna, October 4: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎట్టకేలకు పూర్తయింది. రాష్ట్రీయ జనతా దళ్‌(RJD) చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ను (Tejashwi Yadav) కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు ( Congress) 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్‌)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు.

జేఎంఎం, వికాశ్‌షీల్‌ ఇషాన్‌ పార్టీ (వీఐపీ) ఆర్జేడీ కోటాలోనే పోటీచేయనున్నట్లు ప్రకటించారు. అయితే తమకు గౌరవప్రద స్థానాలు ఇవ్వలేదని వీఐపీ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్‌ ఇన్సాస్‌ పార్టీ అధినేత ముకేశ్‌ సాహ్నీ ప్రకటించారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఈసారి రెట్టింపు సీట్లు కేటాయించారు. వాల్మీకి నగర్‌ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ బరిలోకి దిగుతున్నది. బీహార్‌ అసెంబ్లీకి (Bihar Assembly Elections 2020) అక్టోబర్‌ 28, నవంబర్‌ 3,7 తేదీల్లో పోలింగ్‌ జరుగనుంది.

ఇక వాల్మీకీ నగర్‌ లోక్‌సభ స్థానానికి నవంబర్‌ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్‌ ఇన్సాస్‌ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. ఇదిలా ఉంటే బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

అక్టోబర్‌ 28న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, 243 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌, నవంబర్‌ 10వ తేదీన ఓట్ల లెక్కింపు, ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఆ పార్టీ బిహార్‌ శాఖ అధ్యక్షుడు భరత్‌ బింద్‌ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్‌ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్‌ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్‌చేశారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీ, జనతాంత్రిక్‌ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే.

బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే రాజీనామా

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఆర్జేడీకి, జేడీయూకి మధ్య అభిప్రాయబేధాలు రావటంతో జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌కుమార్‌ తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్‌ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య.. అనంతరం అక్కడి బీజేపీ ప్రభుత్వం వ్యహరించిన తీరు యూపీ పక్కనే ఉన్న బీహార్‌ను తాకింది. రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హత్రాస్ ఘటనే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. బీహార్‌లోని మొత్తం ఓటర్లలో దళితులు 17శాతం ఉన్నారు.