Covid in India: దేశంలో మళ్లీ కరోనా అలజడి, ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి అత్యవసర సమావేశం, కోవిడ్ ఇంకా ముగిసిపోలేదని, అప్రమత్తంగా ఉండాలని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
New Delhi, Dec 21: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (Health Minister Mandaviya ) బుధవారం దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఉన్నత ఆరోగ్య అధికారులు, నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
COVID ఇంకా ముగియలేదు (Covid not over yet). అప్రమత్తంగా ఉండాలని, నిఘాను పటిష్టం చేయాలని సంబంధిత అందరినీ ఆదేశించాను. ఎలాంటి పరిస్థితినైనా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము (we are prepared to manage any situation) అని సమావేశం తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రి ట్వీట్ చేశారు.
చైనా, జపాన్, యుఎస్, బ్రెజిల్ ఇతర దేశాలలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన నేటి సమావేశానికి ముందు, ఇతర దేశాలలో కోవిడ్ -19 పరిస్థితి, భారతదేశానికి ఏమి చేయాలి అనే దానిపై చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నిన్న మార్గదర్శకాలు జారీ చేశామని పవార్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
కేవలం 27-28 శాతం మంది మాత్రమే ముందు జాగ్రత్త మోతాదు తీసుకున్నారు. ఇప్పటికైనా సీనియర్ సిటిజన్లకు, ముందు జాగ్రత్త మోతాదు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముందు జాగ్రత్త మోతాదు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని మార్గనిర్దేశం చేస్తున్నామని NITI ఆయోగ్ సభ్యుడు డాక్టర్ VK పాల్ అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో, ఇంటి లోపల లేదా ఆరుబయట మాస్క్‌లను ఉపయోగించాలని ఆయన ప్రజలను కోరారు. కొమొర్బిడిటీలు ఉన్నవారికి లేదా ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైనది" అని పాల్ చెప్పారు.
నేటి సమావేశానికి హాజరైన వారిలో ఆరోగ్య కార్యదర్శులు, ఆయుష్, ఫార్మాస్యూటికల్స్ విభాగం, బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్, NITI ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) VK పాల్, (ఎన్‌టీఏజీఐ) చైర్మన్ ఎన్ ఎల్ అరోరా, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, MoHFW DGHS డాక్టర్ అతుల్ గోయెల్, రోగనిరోధక టీకాలపై జాతీయ సాంకేతిక సలహా బృందం ఉన్నారు.
జపాన్, యుఎస్ఎ, కొరియా, బ్రెజిల్ మరియు చైనాలలో అకస్మాత్తుగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా, రోజు వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని నిన్న కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నెట్‌వర్క్ ద్వారా వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి కేస్ శాంపిల్స్ చాలా అవసరమని లేఖలో పేర్కొన్నారు.