Gurugram: కరోనా భయంతో మూడేళ్ల నుంచి కొడుకుతో పాటూ క్వారంటైన్‌లోనే ఉన్న మహిళ, ఆఫీసుకు వెళ్తున్నాడని భర్తను కూడా దగ్గరకు రానివ్వని వైనం
భర్తను కూడా ఇంట్లోకి రానివ్వకుండా లోపలి నుంచి తాళం వేసుకున్నది. ఈ విచిత్ర ఘటన గురుగ్రామ్‌లో (Gurugram) వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సుజన్.. భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు.
Gurugram, FEB 23: కరోనా భయంతో (Covid scared woman) ఓ మహిళ తన 10 ఏండ్ల కొడుకుతో కలిసి దాదాపు మూడేండ్లు ఇంట్లోనే ఉన్నది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వకుండా లోపలి నుంచి తాళం వేసుకున్నది. ఈ విచిత్ర ఘటన గురుగ్రామ్‌లో (Gurugram) వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సుజన్.. భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. అయితే 2020లో తొలిసారిగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించగానే సుజన్ ఉద్యోగానికి వెళ్లాడు. కానీ ఆనాటి నుంచి సుజన్ భార్య (Sujan) మున్‌మున్ స్వీయ నిర్భందాన్ని విధించుకున్నది. తలుపు తీయాలని సుజన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో సుజన్ సమీపంలోనే మరో ఇంట్లో ఉంటున్నాడు.
రోజూ నిత్యావసరాలను తీసుకొచ్చి తలుపు వద్ద ఉంచేవాడు. ఆయన వెళ్లాక ఆమె వాటిని తీసుకునేది. భార్యాభర్తలు వీడియోకాల్‌లో మాట్లాడుకునేవాళ్లు. ఇలా దాదాపు మూడేండ్లు గడిచినా సుజన్ భార్య మనసు మారలేదు. దీంతో ఆయన పోలీసులను సంప్రదించాడు. పోలీసులు డోర్‌ను పగులకొట్టి మున్‌మున్‌ని, ఆమె కుమారుడిని దవాఖానకు తరలించారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం.