Coronavirus Third Wave: పెరుగుతున్న కేసులతో దేశంలో థర్డ్ వేవ్ ప్రకంపనలు, కొత్తగా 45,083 మందికి కరోనా, కేరళలో కోవిడ్ ఉగ్రరూపం, మళ్లీ నైట్ కర్ప్యూ విధించిన పినరయి విజయన్ సర్కారు
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కరోనా వల్ల 4,37,830 మంది బాధితులు మరణించారు.
New Delhi, August 29: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్ కేసులు (COVID19 India reports 45,083 new cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కరోనా వల్ల 4,37,830 మంది బాధితులు మరణించారు. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 35,840 మంది కరోనా నుంచి బయటపడ్డారని, మరో 460 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 97.53 శాతంగా ఉందని తెలిపింది.
కాగా, కేరళలో కరోనా తీవ్రత రోజురోజుకు (Coronavirus Third Wave) అధికమవుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో రికార్డయిన 45 వేల పాజిటివ్ కేసుల్లో ఒక్క కేరళలోనే 31,265 ఉండటం గమనార్హం. వైరస్ వల్ల రాష్ట్రంలో నిన్న ఒకేరోజు 153 మంది మరణించారు. అంటే కొత్త కేసులు, మరణాల్లో అత్యధికశాతం వాటా ఆ రాష్ట్రంలోనే ఉండటం విశేషం. కరోనా మూడో వేవ్ పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా శనివారం 17,55,327 మందికి పరీక్షలు చేశారు. దీంతో ఆగస్టు 28 నాటికి మొత్తం 51,86,42,929 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది.
కేరళలో కరోనా (Kerala Covid) కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ ఆగస్టు 30 వ తేదీ నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. అధిక సానుకూలత ఉన్న ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కేంద్రం సూచించిన రెండు రోజుల తర్వాత కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.