Cyclone Amphan Videos: విధ్వంసం సృష్టించిన అంఫాన్, వెస్ట్ బెంగాల్,ఒడిషాలో భారీగా ఆస్తి నష్టం, నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు, వీడియోల్లో విధ్వంసం ఎలా ఉందో మీరే చూడండి
తుఫాన్ వల్ల ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. బలమైన ఈదురుగాలులు, వర్షాలకు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి. కరోనా వైరస్ కన్నా అంఫాన్ తుఫాన్ ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM) అన్నారు. అంఫాన్ నష్టం సుమారు లక్ష కోట్ల వరకు ఉంటుందని ఆమె అంచనా వేశారు. దాదాపు అయిదు లక్షల మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. ఒడిశాలో కూడా లక్షకు పైగా మందిని షెల్టర్ హోమ్స్‌కు పంపించారు.
Kolkata, May 21: బెంగాల్ తీరాన్ని తాకిన అంఫాన్ తుఫాన్ (Cyclone Amphan) వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. తుఫాన్ వల్ల ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. బలమైన ఈదురుగాలులు, వర్షాలకు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి. కరోనా వైరస్ కన్నా అంఫాన్ తుఫాన్ ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM) అన్నారు. ప్రారంభమైన రైల్వే బుకింగ్స్, జూన్ 1న పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్ రైళ్లు, సాధారణంగానే టికెట్ ధరలు, జనరల్ కోచ్‌ల్లోనూ రిజర్వుడ్ సీట్లు
అంఫాన్ నష్టం సుమారు లక్ష కోట్ల వరకు ఉంటుందని ఆమె అంచనా వేశారు. దాదాపు అయిదు లక్షల మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. ఒడిశాలో కూడా లక్షకు పైగా మందిని షెల్టర్ హోమ్స్‌కు పంపించారు. తీరాన్ని తాకిన అంఫాన్, నాలుగు గంటల పాటు ప్రభావం, అల్లకల్లోలంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరప్రాంతాలు, రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
పశ్చిమబెంగాల్ (West Bengal), ఒడిశాల్లో (Odisha) ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో.. ప్రాణనష్టం తప్పినా.. ఆస్తినష్టం భారీగానే వాటిల్లింది. తీరం దాటుతున్న సమయంలో తీరం వెంబడి బీభత్సం సృష్టించింది. గంటకు సుమారు 190 కిమీల వేగంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్లు నేలమట్టం అయ్యాయి. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ ధ్వంసమయింది.
అంఫాన్ తుఫాను ప్రభావంతో కుండపోతగా వర్షం కురవడంతో కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్భందమయ్యింది. రన్‌వే, హాంగర్లు పూర్తిగా నీటమునిగాయి. వర్షానికితోడు బలమైన ఈదురు గాలుతో విమానాశ్రయంలోని కొన్ని నిర్మాణాలు విరిగిపడ్డాయి. దీంతో విమనాలు ధ్వంసమయ్యాయి.
Kolkata Airport flooded video
దీంతో ఎయిర్‌పోర్టులో అన్ని కార్యకలాపాలను ఉదయం 5 గంటలకు పూర్తిగా నిలిపివేశారు. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి మార్చి 25న లాక్‌డౌన్ విధించడంతో ప్రయాణికుల విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కార్గో విమానాలను మాత్రమే నడుపుతున్నారు.
Transformer Blast:
Coconut tree on fire:
ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. తీరం దాటే సమయంలో తీరంలో అలలు భారీగా ఎగసిపడ్డాయి. కోల్‌కతాలో లోతట్టు ప్రాంతాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. ఒడిశాలో పురి, ఖుర్ద, జగత్సింగ్‌పుర్, కటక్, కేంద్రపార, జాజ్‌పుర్, గంజాం, భద్రక్, బాలాసోర్‌ల్లో మంగళవారం నుంచి భారీ వర్షపాతం నమోదైంది. దేశాన్ని వణికిస్తున్న ప్రధాన నగరాలు, తాజాగా 24 గంటల్లో 5,609 కరోనా కేసులు, 132 మంది మృతి, దేశ వ్యాప్తంగా లక్షా 12 వేలు దాటిన కోవిడ్-19 కేసులు
తుపాను ప్రభావం ప్రారంభమవడానికి ముందే రెండు రాష్ట్రాల్లో 6.58 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.జాతీయ విపత్తు స్పందన దళాలు రెండు రాష్ట్రాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాయని ఎన్‌డీఆర్‌ఎఫ్ చీఫ్ ఎస్‌ఎన్ ప్రధాన్ బుధవారం తెలిపారు. ఒడిశాలో 20 బృందాలు, పశ్చిమబెంగాల్‌లో 19 బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయన్నారు.
People remember the nerve chilling experience:
రోడ్లపై పడిన భారీ వృక్షాలను తొలగిస్తున్నాయన్నారు. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణ జిల్లాలు, తూర్పు మిద్నాపూర్ జిలాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహోపాత్ర తెలిపారు.
Below are a few images
‘ఆంఫాన్’ తుపాన్ (Amphan Cyclone) పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ తీరంలోని దిఘా, హతియా దీవుల మీదుగా సుందర్ బన్స్ నుంచి బుధవారం సాయంత్రం ఐదున్నరగంటలకు తీరం దాటింది. ఈ విపత్తు వల్ల బంగ్లాదేశ్ లోని బర్గుణ, సాత్ ఖిరా, ఫిరోజ్ పూర్, భోలా, పాటువాఖలీ ప్రాంతాల్లో ఏడుగురు మరణించారని బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు.
Here's another video:
తుపాన్ సహాయపనుల కోసం పది కంట్రోల్ రూంలను ఏర్పాటుచేశామని బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకునేందుకు 325 వైద్యబృందాలను ఏర్పాటు చేశారు. ఆంఫన్ తుపాన్ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 20 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించామని, ఆర్మీని రంగంలోకి దింపామని ప్రధాని షేక్ హసీనా చెప్పారు.