Cyclone Dana Live Updates: నాలుగు రాష్ట్రాలకు 'దానా' తుపాను ఎఫెక్ట్, ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు మూసివేత, పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఒడిశా ,పశ్చిమ బెంగాల్ తీరప్రాంత జిల్లాలలోని అన్ని పాఠశాలలును ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. దానా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Cyclone Dana Live Updates Evacuation of 10 lakh people in Odisha, Bengal begins(google Images)

Hyd, Oct 23:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఒడిశా ,పశ్చిమ బెంగాల్ తీరప్రాంత జిల్లాలలోని అన్ని పాఠశాలలును ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. దానా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం తీవ్ర అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారి అక్టోబర్ 25 తెల్లవారుజామున ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100-110 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఒడిశా,బెంగాల్ లో దాదాపు 10 లక్షల మందిని పునరావాసం కల్పించేందుకు మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లు, ఫ్లడ్ షెల్టర్లు, ఇతర భవనాలను గుర్తించి తాత్కాలిక సహాయ శిబిరాలకు సిద్ధం చేశారు.ప్రజలకు ఆహారం, తాగునీరు, వెలుతురు, పారిశుధ్యం, ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆ రాష్ట్రమంత్రి తెలిపారు.

ఇక తుఫాను కారణంగా ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్‌లో 150 రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లను రూట్ మార్చారు. తుఫాను కారణంగా అక్టోబర్ 23-25 ​​నుండి ఒడిశాలోని 14 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యా సంస్థలు మూసివేశారు. అంగుల్, పూరీ, నయాగర్, ఖోర్ధా, కటక్, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, జాజ్‌పూర్, భద్రక్, బాలాసోర్, కియోంజర్, ధెంకనల్, గంజాం మరియు మయూర్‌భంజ్‌లతో సహా పద్నాలుగు జిల్లాలను అప్రమత్తం చేసింది ఐఎండీ.

మంగళవారం బంగాళాఖాతంలో సముద్ర ఉపరితలంలో గాలుల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లుగా ఉండగా ఇవాళ ఇది 70 నుంచి 80 కిలోమీటర్లకు చేరుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గురువారం ఉదయానికి వీటి వేగం మరింత పెరిగి.. తుఫాను తీరం దాటే శుక్రవారం ఉదయానికి ఉగ్రరూపం దాల్చుతుందని ఐఎండీ వెల్లడించింది.   రేపు తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఉత్తరాంద్రకు హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన 

ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని సాగర్ ఐల్యాండ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ-ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉన్న ఈ తుఫాను గత ఆరు గంటలుగా గంటకు 3 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది.

తుపాను కారణంగా ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడంచారు. దానా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మూడు రోజుల పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. తుఫాను ప్రభావం చూపితే ప్రజలను తరలించడానికి వీలుగా తీర ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలను విపత్తు నివారణ శాఖ సిద్ధం చేసింది.